4.50లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం
కేఎల్‌ఐలోని ఐదు మోటర్లు పంపింగ్ చేస్తే పూర్తిస్థాయిలో సాగునీటిని అందించవచ్చని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
- కేఎల్ఐలో పనిచేయని రెండు మోటర్లు
- నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ తాగునీటి జలాలు
- ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, జూన్ 28 : కేఎల్‌ఐలోని ఐదు మోటర్లు పంపింగ్ చేస్తే పూర్తిస్థాయిలో సాగునీటిని అందించవచ్చని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఇరిగేషన్ సీఈ విజయభాస్కర్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి మంత్రి కొల్లాపూర్ మండలం ఎల్లూ రు, రేగుమాన్గడ్డ సమీపంలోని కేఎల్ఐ, పీఆర్ఎల్ ప్రాజెక్టుల్లోని పంప్ సెట్లు, మోటర్లు, టన్నెల్, ఓపెన్ కెనాళ్లను, పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్, ఎల్లూరు రిజర్వాయర్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ కెనాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ కేఎల్ఐ ప్రాజెక్టు కింద జమ్ముతో నిండిన కాల్వలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేఎల్‌ఐతో పాటు, జూరాల, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల కింద ఉన్న కాల్వలకు కూడా మరమ్మతులు చేపట్టాలన్నారు.
కేఎల్‌ఐలోని ఐదు మోటర్లలో రెండు పనిచేయడం లేదని.. వాటికి రిపేర్ చేయించి త్వరలోనే మిషన్ భగీథకు నార్లాపూర్ పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్ ద్వారా నీళ్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీశైల జలాశయంలో నీళ్లు లేకున్నా భగీరథకు నీళ్లు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. కేఎల్ఐ ద్వారా 4.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని.. రోజుకు 4వేల క్యూసెక్కులను పంపింగ్ చేయొచ్చని చెప్పా రు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఇరిగేషన్ సమస్యలపై పరిష్కారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి అవకాశం లేకుండా రాత్రింబవళ్లు పని చేస్తామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

