మక్తల్ టౌన్ సెప్టెంబర్ 26: భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలలో పోరా ట స్పూర్తిని నింపి ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక ఐలమ్మ అని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి నివాసంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నట్లు ఎమెల్యే చిట్టెం పేర్కొన్నారు.
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 26: నిజాం పాలనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన స్ఫూర్తిప్రదాత ఐలమ్మ అని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 103వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, ఆర్డీవో రాంచందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని చౌక్‌బజార్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని జరుపుకొన్నారు. కార్యక్రమంలో రజకసంఘం జిల్లా కార్యదర్శి సాయిబన్న, పట్టణ ఉపాధ్యక్షులు రఘు, నాయ కులు బస్వరాజ్, కృష్ణ, సాయిలు, టీఆర్ఎస్ నాయకులు శివరాంరెడ్డి, సరాఫ్ నాగరాజు, యాంకి హన్మంత్‌రెడ్డి, న్యాయవాది రఘువీర్‌యాదవ్ పాల్గొన్నారు.
మక్తల్ టౌన్ సెప్టెంబర్ 26: తెలంగాణలో సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ తెలంగాణ ప్రజానీకానికి ఆదర్శప్రాయురాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాస గృహంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, టీఆర్స్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు, జూట్ల శంకర్, రామలింగం, నర్సింహారెడ్డి, కర్రెం కృష్ణ, ఉమాశంకర్‌గౌడ్, మైమూద్, శివారెడ్డి, ఆనంద్, రజక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్ అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, సీనియర్ నాయకులు చంద్రకాంత్, శివరాంరెడ్డి, యాంకి హన్మంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మహిమూద్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్, సెప్టెంబర్ 26: తాసిల్దార్ కార్యాలయంలో రజక సంఘం, అఖిల పక్ష నాయకుల సమక్షంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . అనంతరం పండ్లను పంపిణీ చేశారు. కార్యాక్రమంలో డీటీ శ్రీనివా సులు, ఆర్ఐ సుధాకర్‌రెడ్డి, గో పాల్‌రావు, తాసిల్దార్ కా ర్యాలయ సిబ్బంది, ఎంపీటీసీ గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, రజకసంఘం నాయకులు బుచ్చన్న, కొండన్న, తిమ్మన్న, మోహన్ పాల్గొన్నారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 26: మండలకేంద్రంలో ఎంపీడీవో కాళప్ప ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలుగౌడ్, సూపరింటెండెంట్ కొండన్న, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఏపీఎం నర్సింహులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధన్వాడ, సెప్టెంబర్ 26: మండల కేంద్రంలోని తాసి ల్దార్ కార్యాలయం, రాంకిష్టయ్యపల్లి, కిష్టాపూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో సోమవారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ కడపయ్య, విండో వైస్ చైర్మన్ గండిరాజు, యూత్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.