బుజ్జి కారు సందడి
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి కారు’ పాలమూరులో సందడి చేసింది. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతున్నది.
- పాలమూరులో ‘కల్కి’ సినిమా వాహనం
- సెల్ఫీలతో సందడి చేసిన యువత
- మూవీ సక్సెస్‌పై అభిమానులకు డైరెక్టర్ నాగ్అశ్విన్ కృతజ్ఞతలు
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 23 : కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి కారు’ పాలమూరులో సందడి చేసింది. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతున్నది. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బుజ్జి కారును ప్రదర్శనకు ఉంచారు. కల్కిలో హీరో ప్రభాస్ వినియోగించిన బుజ్జి కారు వీక్షించేందు కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కారును తిలకిస్తూ సెల్పీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలనుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పాత డీఈవో కార్యాలయం నుంచి ఎర్రసత్యం చౌరస్తా వరకు ట్రాఫిక్ అంతా జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సినిమాలో కంటే కారును నేరుగా చూడడం ఎంతో సంతోషంగా ఉందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
దర్శకుడికి ఘన స్వాగతం..
కల్కి సినిమా విజయవంతం కావడంతో దర్శకుడు నాగ్అశ్విన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఏవీడీ థియేటర్ వరకు హీరో ప్రభాస్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కల్కి సినిమా సక్సెస్‌పై డైరెక్టర్ నాగ్అశ్విన్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన సిని మా ఇంత టి ఘన విజయం సా ధించడంలో అభిమానులు కీలకపాత్ర పోషించారన్నారు. సినిమాకు రూ.1200 కోట్లు ఆదాయం వచ్చిందంటూ అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపా రు. త్వరలోనే కల్కి-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు.
బుజ్జి కారు ప్రత్యేకతలు..
బుజ్జి కారును మహబూబ్‌నగర్ తీసుకురావడానికి ప్రధాన కారణం డైరక్టర్ నాగ్అశ్విన్ సొంత జిల్లా కావడం. అభిమానుల కోరిక మేరకు ఇక్కడకు తీసుకొచ్చామని కల్కి సినిమా సంబంధీకుడు ఆనంద్ తెలిపారు. కారును ప్రత్యేకంగా మహేంద్ర కంపెనీ వాళ్లు కోయంబత్తూర్‌లో తయారు చేశారు. మూడు టైర్లు, ఆరు టన్నుల బరువుతో ఉన్న ఈ వాహనం ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే విధంగా తయారు చేశారన్నారు. ఒక్కసారి చార్జ్జీతో యాభై కిలోమీటర్ల వరకు వెళ్తుందన్నారు. దీని సైజు 12 ఫీట్ల వెడల్పు, 19 ఫీట్ల పొడవు ఉంటుందని తెలిపారు. బుజ్జి కారును కల్కి పార్ట్-2లో వాడుకుంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

