బీఆర్ఎస్తోనే సంక్షేమం
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, బీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వడ్డెరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందహళ్లి, రామన్‌పాడు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి రాములు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మదనాపురం, నవంబర్ 17 : కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, బీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వడ్డెరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందహళ్లి, రామన్‌పాడు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి రాములు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కారుగుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసులు, కురుమూర్తి, నాయకులు విష్ణు, రమేశ్, పాషా, కృష్ణ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 17 : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి చెప్పారు. అడ్డాకుల మండలంలోని ముత్యాలంపల్లిలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. అదేవిధంగా మండల కేంద్రంతోపాటు కందూరు, శాఖాపూర్, కాటవరం, గుడిబండ, రాచాల, పోన్నకల్, తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లితండా, రాంచంద్రాపూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో పత్రాలను అందజేసి ప్రచారం చేశారు.
‘దేవరకద్రలో..
దేవరకద్ర, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో గడపగడపకూ వెళ్లి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల హజిల్లాపూర్ గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తెలంగాణలో అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిగడపకు వివరించి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మూడోసారి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్, ప్రభాకర్‌గౌడ్ ఉన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, నవంబర్ 17 : సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గెలుపునకు పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల మ్యానిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్ చైర్పర్సన్ జయమ్మ, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, మహేశ్వరీ, తిరుపతయ్య, కొండారెడ్డి, రాములుయాదవ్, రామ్మోహన్‌రెడ్డి, ఖాజమైనొద్దీన్, అయ్యన్న, వహీద్, బాలనారాయణ, రవీందర్‌రెడ్డి, వికాస్, మహేశ్ పాల్గొన్నారు.
కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), నవంబర్ 17 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పనులు, సంక్షేమ పథకాలు గురించి, అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

