మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ 16 డివిజన్లను గెలుచుకుంది. మరో 8 డివిజన్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 53వ డివిజన్లో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ అభ్యర్థి అభ్యంతర వ్యక్తం చేయడంతో రీకౌంటింగ్ నిర్వహించారు. ఇక బీజేపీ సింగిల్ డిజిట్స్ స్థానాలకి పరిమితం అయింది.
పార్టీ టికెట్లు దొరకని అభ్యర్థులు పోటీ చేసి అధికార పార్టీకి చుక్క లు చూపించారు. ఇండిపెండెంట్లుగా గెలిచి సత్తా చా టారు. ఊహించని రీతిలో ఎంఐఎం కూడా నాలుగు స్థానాలకే పరిమితమైంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 58వ డివిజన్ ఏకగ్రీవం అయింది. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో జరిగిన పోరులో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు దక్కలేదు. ఆ పార్టీ 29 డివిజన్లకే పరిమితమైంది.
బీఆర్ఎస్ 16 స్థానాలు దక్కించుకుంది. 8 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎనిమిదో డివిజన్ అభ్యర్థి సరస్వతి కార్పొరేషన్లో అత్యధికంగా 1023 మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ ఏడు, ఎంఐఎం నాలుగు, ఇండిపెండెంట్లు నాలుగు డివిజన్లు గెలుచుకున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో ఉన్న కాంగ్రెస్ ఇండిపెండెంట్ కలుపుకొని మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది.
మక్తల్ మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 24,345
పోలైన ఓట్లు : 15,369
బీఆర్ఎస్ : 2,174
కాంగ్రెస్ : 7,323
బీజేపీ : 4,680
స్వతంత్రులు : 650
పేట మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 35,459
పోలైన ఓట్లు : 26,124
బీఆర్ఎస్ : 5,314
కాంగ్రెస్ : 8,743
బీజేపీ : 9,439
స్వతంత్రులు : 2,110
మద్దూరు మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 12,701
పోలైన ఓట్లు : 10,034
బీఆర్ఎస్ : 3,240
కాంగ్రెస్ : 5,008
బీజేపీ : 877
స్వతంత్రులు : 781
కోస్గి మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 20,248
పోలైన ఓట్లు : 15,219
నోట/చెల్లని ఓట్లు : 209
బీఆర్ఎస్ : 3,204
కాంగ్రెస్ : 9,226
బీజేపీ : 1,690
స్వతంత్రులు : 829
అయిజ మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 23106
పోలైన ఓట్లు : 19,492
బీఆర్ఎస్ : 10,397
కాంగ్రెస్ : 8,265
బీజేపీ : 361
ఇతరులు : 151
వడ్డేపల్లి మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 10604
పోలైన ఓట్లు : 8,935
బీఆర్ఎస్ : 2,977
కాంగ్రెస్ : 2,085
బీజేపీ : 56
ఇతరులు : 13
ఏఐఎఫ్బీ : 3,691
అలంపూర్ మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 8,751
పోలైన ఓట్లు : 7,030
బీఆర్ఎస్ : 3,130
కాంగ్రెస్ : 3,436
బీజేపీ : 299
ఇతరులు : 75
గద్వాల మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 65,282
పోలైన ఓట్లు : 45,679
బీఆర్ఎస్ : 13,809
కాంగ్రెస్ : 20,814
బీజేపీ : 9,477
ఇతరులు : 3,654
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 35,378
పోలైన ఓట్లు : 26,151
బీఆర్ఎస్ : 9,604
కాంగ్రెస్ : 12,728
బీజేపీ : 1,578
ఇతరులు : 2,241
కొల్లాపూర్ మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 19,356
పోలైన ఓట్లు : 15,505
బీఆర్ఎస్ : 5,311
కాంగ్రెస్ : 9,236
బీజేపీ : 837
ఇతరులు : 67
కల్వకుర్తి మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 26,023
పోలైన ఓట్లు : 21,027
బీఆర్ఎస్ : 6,249
కాంగ్రెస్ : 9,247
బీజేపీ : 4,156
ఇతరులు : 1,375
వనపర్తి మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 64,190
పోలైన ఓట్లు : 45,831
బీఆర్ఎస్ : 14,126
కాంగ్రెస్ : 17,580
బీజేపీ : 6,852
ఇతరులు : 7,263
పెబ్బేరు మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 14,333
పోలైన ఓట్లు : 12,796
బీఆర్ఎస్ : 4,577
కాంగ్రెస్ : 5,075
బీజేపీ : 1,582
ఇతరులు : 143
అమరచింత మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 9,172
పోలైన ఓట్లు : 7,645
బీఆర్ఎస్ : 2,375
కాంగ్రెస్ : 1,919
బీజేపీ : 2,005
ఇతరులు : 1,340
కొత్తకోట మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 18,483
పోలైన ఓట్లు : 14,326
బీఆర్ఎస్ : 4,321
కాంగ్రెస్ : 6,604
బీజేపీ : 2,798
ఇతరులు : 144
ఆత్మకూరు మున్సిపాలిటీ :
మొత్తం ఓట్లు : 11,579
పోలైన ఓట్లు : 8,911
బీఆర్ఎస్ : 2,247
కాంగ్రెస్ : 4,118
బీజేపీ : 2,349
ఇతరులు : 207