రంగుల హరివిల్లు భువి నుంచి దివికి దిగొచ్చినట్లు పల్లె,పట్నం రంగుల శోభితమైంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో కలర్‌ఫుల్ పండుగైన హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగితేలారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. డీజే మోతల మధ్య యువత డ్యాన్స్‌లతో హోరెత్తించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆనందకేళిలో పాలుపంచుకున్నారు.
నారాయణపేట టౌన్, మార్చి 7: పట్టణంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్స వాల మధ్య హోలీ పండుగను జరుపుకొన్నారు. సోమవారం అర్ధ్దరాత్రి వార్డుల్లో చిన్నారులు, పెద్దలు డప్పులు కొట్టుకుం టూ కాముడి విగ్రహాన్ని ఊరేగించి ప్రధాన చౌరస్తాల్లో దహ నం చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, నాయకులు చంద్రకాంత్ తదితరులు ఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నారాయణపేట రూరల్,మార్చి 7: మండల పరిధిలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్‌పల్లి, పేరపళ్ళ, ఊటకుంటతండా తదితర గ్రామాల్లో హోలీ సంబురాలు ఘనంగ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పేటలో పీఆర్టీయూటీఎస్ నాయకులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఊట్కూర్ మండలంలో…
ఊట్కూర్, మార్చి 7 : మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రజలు సోమవారం రాత్రి కామదహనం నిర్వ హించారు. మంగళవారం యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ప్రజాప్రతినిధులు, యువజ న సంఘాల సభ్యులు హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో యువకులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
మాగనూర్ మండలంలో…
మాగనూర్, మార్చి 7: మండల వ్యాప్తంగా ప్రజలు హో లీ సంబురాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెం బర్లు, నాయకులు పాల్గొని శుభాకాక్షలు తెలిపారు.
మరికల్ మండలంలో…
మరికల్ ,(ధన్వాడ),మార్చి 7: మరికల్, ధన్వాడ మండ లాల్లో యువతీ, యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకున్నారు. మరికల్ మండల కేంద్రంలో పేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ హోలీ వేడుకల్లో పాల్గొని మహిళలను ఉత్త్తేజపరిచారు. యువకులు, రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ చౌరస్తాలో ఆటపాటలతో ఉత్సాహంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ధన్వాడలో యువకులు ఉట్లుకొట్టి హోలీ సంబురాలు జరుపుకొన్నారు.
మక్తల్ మండలంలో…
మక్తల్ టౌన్/అర్బన్ మార్చి 7: మండల వ్యాప్తంగా హోలీ ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల్లో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో…
నర్వ, మార్చి 7 : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో హోలీ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు వివరిస్తూ బందోబస్తు నిర్వహించారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, మార్చి 7: మండల కేంద్రంతో పాటు గుడేబల్లూర్, కున్సీ, ముడుమాల, మురహరిదొడ్డి గ్రామాల్లో హోలీ వేడు కలను యువతీ, యువకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.
కోస్గి మండలంలో…
కోస్గి, మార్చి7: పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో యువతీ,యుకులు ఉత్సాహంగా రంగులు చల్లు కొని వేడుకులు ఘనంగా నిర్వహించారు.
దేవరకద్ర మండలంలో…
దేవరకద్ర రూరల్, మార్చి 7: దేవరకద్ర, కౌకుంట్ల, చిన్న చింతకుంట మండలాల్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నవాబ్‌పేట మండలంలో…
నవాబ్‌పేట, మార్చి7: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. యు వకులు, చిన్నారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.