గద్వాల, మార్చి 6 : జిల్లా కేంద్రం లో సినిమా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా సందడి చేశారు. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పా టు చేసిన కాసం షాపింగ్ మాల్ ను బుధవారం ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్‌చేసి జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా షాపిం గ్ మాల్లో పట్టువస్ర్తాలతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నిరకాల వస్ర్తాలు ఈ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నాయని, సరసమైన ధరలకే దుస్తులు లభిస్తాయని వివరించారు.
షాపింగ్ మాల్ నిర్వాహకులు కాసం మల్లికార్జున, కేదారినాథ్, నమశ్శివాయ మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంలో తమకు 78 ఏండ్ల అనుభవం ఉందన్నారు. సరసమైన ధరలకు వస్ర్తాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో 11వ బ్రాంచ్ గద్వాలలో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాసం శివప్రసాద్, రఘురామరాజ బట్ల, కాసం ప్రేమ్‌కుమార్, కాసం సాయిగుప్తా, కాసం ప్రణీత్‌కుమార్, అరుణ్‌కుమార్, వరుణ్ విశాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.