Anganwadi eggs | గుడ్డుకు గుర్తు.. అంగన్వాడీ కేంద్రాల కోడిగుడ్లపై సర్కారు ముద్ర
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభు త్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చు ట్టింది. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా వాటికి బ్లూ, గ్రీన్, రెడ్ రంగు ల్లో ముద్ర వేసి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
- బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో మూడు విడుతల్లో పంపిణీ
- అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
- హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
Anganwadi eggs | బాలానగర్, జూన్ 23 ;అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభు త్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చు ట్టింది. కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా వాటికి బ్లూ, గ్రీన్, రెడ్ రంగు ల్లో ముద్ర వేసి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. మూడు విడుతల్లో పంపిణీ చేయనుండగా.. ఈ ప్రక్రియపై ఆయా కేంద్రాల్లో ముందస్తుగా సీడీపీవోలు, సూపర్వైజర్లు టీచర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు.
జడ్చర్ల నియోజకవర్గంలోని అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 314 కేం ద్రాలున్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 275 ఉండగా, 39 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గర్భిణులు 3,607, బాలింతలు 3,204, ఏడు నెలల నుంచి సంవత్సరం నిండిన పిల్లలు 1,324 మంది ఉన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు, ఆరేండ్ల చిన్నారులకు నిత్యం పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, టమాటతోపాటు ప్రతిరోజూ సాంబర్, రైస్ ఇస్తారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు 16 గుడ్లు, రెండున్నర కిలోల బాలామృతం, పాలు సరఫరా చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు మూడు నుంచి ఆరునెలల చిన్నారులకు రోజుకొకటి చొప్పున రెండు విడుతల్లో గుడ్లను అందజేస్తున్నారు. ఆరు నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులకు నెలకు రెండు విడుతల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నారు.
అవకతవకలకు అడ్డుకట్ట..
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు ఇకపై పక్కదారి పట్టే అవకాశం ఉండ దు. వాటిపై ప్రభుత్వం ముద్రించిన గు ర్తు ఉంటుంది. ఎక్కడైనా విక్రయించినా, ప క్కదారి పట్టించినా సులువుగా గుర్తించి ఆ యా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నది. లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వం చేసిన మార్పులు, పకడ్బందీ చర్యల వల్ల పారదర్శకత నెలకొంది. గ్రామాల్లో నిత్యం పర్యవేక్షిస్తూ బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కమల, అంగన్వాడీ టీచర్, బాలానగర్
పారదర్శకత పెరుగుతుంది..
కోడిగుడ్లపై ముద్రలు వేసి దశలవారీగా బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో మూడు విడుతల్లో సరఫరా చేయడంతో పారదర్శకత పెరుగుతుంది. లబ్ధిదారులకు చేరాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. పౌష్టికాహారం పంపిణీని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. లబ్ధిదారులకు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– సునీత, ఐసీడీఎస్ సూపర్వైజర్, జడ్చర్ల
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

