ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించాలే..

అలంపూర్, జూన్ 23 : ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యం మేరకు బుధవారం అలంపూరు మండలం గుందిమల్ల గ్రామశివారులో కృష్ణానదిపై జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, ఎఫెక్స్ అనుమతులు లేకుండా కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించే ప్రాజెక్టులను ఆపకపోతే సహించేదిలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కంటే ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసేలా జోగుళాంబ బ్యారేజీ నిర్మించుకుంటామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాలుగు ఎత్తిపోతల ద్వారా 5లక్షల ఎకరాలకు నీరు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారన్నారు.
ఆ విధంగా జరిగితే అలంపూరు ప్రాంతంలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం లేకుండాపోతుందన్నారు. అలాగే 130 గ్రామాల ప్రజలకు తాగునీరు దొరికే అవకాశం కూడా ఉండదన్నారు. ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద చేపట్టిన కుడికాల్వ నిర్మాణం అక్రమమన్నారు. తెలంగాణ రైతాంగం కడుపుకొట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకున్న ప్రకారం సుంకేసుల రాజోలి వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసుకుని అలంపూరు ప్రాంతానికి రావాల్సిన సాగునీరు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ నీటి వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నీటి వినియోగ పరిష్కారాలపై కేంద్రం స్పందించాలని, ఇలాగే చోద్యం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊరికే ఉండదన్నారు. కార్యక్రమంలో గుందిమల్ల సర్పంచ్ వసుంధరపెద్దారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న,మాజీ సర్పంచ్ అయ్యస్వామి, నరేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

