పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఆదేశించారు.
- ఎన్నికల సిబ్బందికి వసతులు ఏర్పాటు చేయాలి
- రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలి
- అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్
ఆత్మకూరు, అక్టోబర్ 31 : పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో విధిగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలలోని ఓల్డ్ హాల్ పోలింగ్ కేంద్రాన్ని కలరింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా స్నానపు గదులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతిపోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగుల నిమిత్తం ర్యాంపును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అభ్యర్థులు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పక అనుమతి తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించొద్దని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రచారాన్ని పరిశీలించేందుకు సంబంధిత అధికారులను ఇప్పటికే నియమించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాసీల్దార్ రాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు
అమరచింత, అక్టోబర్ 31: పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు విద్యుత్, శానిటేషన్, తాగునీరు సౌకర్యాలను కల్పించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ మాయంక్ మిట్టల్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మక్తల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అమరచింత తాసీల్దార్ షేక్చంద్పాషా, ఆత్మకూర్ సీఐ కేఎస్ రత్నం, అమరచింత ఎస్సై జగన్మోహన్, మున్సిపాల్ కమిషనర్ మహ్మద్ఖాజాతో కలిసి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల, ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, మండలంలోని నందిమల్ల, మస్తీపూర్, నందిమల్ల ఎక్స్‌రోడ్డులోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు వేసిన నెంబర్లను పరిశీలన చేసి పట్టణంలో ఎంతమంది ఓటర్లు ఏ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకుంటారో వారి వివరాలతో కూడిన జాబితా, ఓటర్లు ఇబ్బందులు పడకుండా తయారు చేసి పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు. అలాగే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

