కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే కరెంట్ సంక్షోభం : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల మూలంగా ప్రస్తుతం దేశమంతా కరెంట్ కోతలతో సతమవుతున్నదని మంత్రి పేర్కొన్నారు.

వనపర్తి : కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల మూలంగా ప్రస్తుతం దేశమంతా కరెంట్ కోతలతో సతమవుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో కరెంట్ ఇబ్బందులు లేకుండా పోయాయి.
గురువారం వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర కరంట్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదు. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ శక్తులూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేవని మంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

