ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలు
మండల కేం ద్రంలోని ఎంబీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చిలో కేక్‌కట్ చే సి పండుగను ఘనంగా నిర్వహించుకోన్నారు.
- చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు ఆరాధనలు
దేవరకద్ర, డిసెంబర్ 25 : మండల కేం ద్రంలోని ఎంబీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చిలో కేక్‌కట్ చే సి పండుగను ఘనంగా నిర్వహించుకోన్నారు. కొవ్వొత్తులను వెలిగించారు. అదేవిధంగా నక్ష త్ర రూపాల్లో ఉన్న సెట్టింగ్‌లను ఇండ్లపై ఎగురవేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, డిసెంబర్ 25: మిడ్జిల్ మండలం లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి ఉత్సహంగా పాటలు పాడుతూ పాల్గొన్నా రు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా చర్చిలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించా రు. వాడ్యాల, రెడ్డిగూడ, మున్ననూర్, చిల్వే ర్, దోనూర్, కొత్తూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామస్తులు ఉన్నారు.
ఊట్కూర్‌లో..
ఊట్కూర్, డిసెంబర్ 25 : మండలకేంద్రంతోపాటు కొల్లూరు, పెద్దపొర్ల, బిజ్వారం గ్రామాల్లో సోమవారం క్రిస్మస్ పండుగను పు రస్కరించుకొని క్రీస్తు జన్మదిన వేడుకలకు క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రా మాల్లో క్రిస్టియన్లు కొత్త బట్టలు ధరించి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అ సందర్భం గా పలువురు అనాథలకు క్రిస్మస్ కిట్లు, దుస్తులను పంపిణీ చేశారు. కేక్‌కట్ చేసి పంచిపెట్టా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, సరో జస మృద్ది, రవికుమార్, రవీందర్‌రెడ్డి ఉన్నారు.
జడ్చర్లలో..
జడ్చర్లటౌన్, డిసెంబర్ 25 : క్రైస్తవుల ఆరా ధ్య దైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం జడ్చర్లలోని వివిధ చర్చిల్లో క్రైస్తవులు యేసుక్రీస్తు ఆరాధనలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బేతని ఎంబీ. చర్చిలో మతగురువులు యేసుక్రీస్తు సందేశాలను వివరించా రు. ఈ సందర్భంగా ముఖ్య సందేశకులు రెవ కే.జే.ఎస్. బాబురావు హాజరై మాట్లాడారు. యేసు మార్గదర్శంలో ప్రతిఒక్కరూ నడవాల ని సూచించారు. అనంతరం భక్తిగీతాలాపన చేశారు. అలాగే పట్టణంలోని సెంటినరీ ఎం. బీ.చర్చి, ఐపీసీ చర్చి, ఉసన్న చర్చి, యేసుకృ పా ప్రార్థన మందిరం, స్విహాన్ ప్రార్థన మంది రం, పెంటకొస్టన్ చర్చి, యేసుక్రీస్తురాజు చర్చి ల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ పార్టీల నాయకులు క్రైస్తవులను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
మహ్మదాబాద్‌లో..
మహ్మదాబాద్, డిసెంబర్ 25: మహ్మదాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు మండల కేం ద్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్త వులకు మండల ప్రజాప్రతినిదులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాములు, రాజేశ్వర్ పాల్గొన్నారు.
కృష్ణలో..
కృష్ణ, డిసెంబర్ 25 : మండలంలోని తంగిడిగి, వాసునగర్ గ్రామాల్లో సోమవారం క్రిస్మ స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో కేక్ కటింగ్, క్యాండిల్ స ర్వీస్, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
భూత్పూర్లో..
భూత్పూర్, డిసెంబర్ 25 : ఏసుక్రీస్తు జీవితాన్ని సమాజంలోని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకుడు మురళీధర్‌గౌడ్ అన్నారు. సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకొని సియోన్ చర్చి లో ప్రార్థనా సమయంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్‌కట్ చేశారు. కా ర్యక్రమంలో నాయకులు గడ్డం ప్రేమ్‌కుమార్, యాదయ్య, ఫాస్టర్స్ ప్రభుదాస్, సామ్రాట్ పాల్గొన్నారు.
అడ్డాకులలో..
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 25 : అడ్డాకుల మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంబీ సంఘం ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు కుటుంబ సమెతంగా చర్చికి చేరుకొని సంబురాలను ప్రారంభించారు. రెవరెండ్ పాస్టర్ చంద్రశేఖర్, ప్రవీణ్‌కుమార్, మతపెద్దలు పాస్టర్లు ప్రజలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అడ్డాకుల జెడ్పీటీ సీ రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, శ్రీహరి, విజయ్‌మోహన్‌రెడ్డి, దశరథరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, ఎంబీ చర్చి పాస్టర్ చంద్రశేఖర్, కార్యద ర్శి మార్కు, ఉపాధ్యక్షుడు ఆనందం, దానియేలు, సామెల్, సాయన్న పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట, డిసెంబర్ 25 : పట్టణంలోని క్రైస్తవులు సోమవారం క్రిస్మస్ వేడుకల ను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎంబీ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఫాస్టర్ ఆర్.జాన్ముఖ్య అథితిగా హాజరై ఏసు పుట్టు క, బోధనలు వివరించారు. కార్యక్రమంలో ఫాస్టర్ నరేష్, చైర్మన్ రత్నయ్య, ట్రెజరర్ పరంజ్యోతి, సెక్రటరీ వినోద్ పాల్గొన్నారు.
కౌకుంట్లలో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), డిసెంబర్ 25 : కౌకుంట్ల, చిన్నచింతకుంట, గ్రామాల్లో సోమవారం ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీ. మధుసూదన్‌రెడ్డి చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలోని ఎంబీ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్‌కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపా రు. అలాగే కౌకుంట్ల చర్చిలో సర్పంచ్ స్వప్నకిషన్రావు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
నర్వలో..
నర్వ, డిసెంబర్ 25 : నర్వ మండలంలోని కల్వాల్, నర్వ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆయా గ్రా మాల చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్‌కట్ చేసి సంబురాలు జ రుపుకున్నారు. కార్యక్రమంలో నర్వ సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ నీరజ్, నాయకులు జగన్మోహన్రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నవాబ్‌పేటలో..
నవాబ్‌పేట, డిసెంబర్ 25 : మండలంలోని తీగల్‌పల్లి, మల్లారెడ్డిపల్లి, కూచూర్, నవాబ్‌పేట, దాయపంతులపల్లి, దేపల్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డేవిడ్, శివ, వెంకటయ్య, డానేలు, రాజు, యాదయ్య ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

