‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని చిట్టెం రామ్మో హన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, నవంబర్ 30 : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని చిట్టెం రామ్మో హన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో మాగనూర్, కృష్ణ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు బరిలో నిలిచే అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేయాలని కోరారు. కృష్ణ మండలంలోని 13 పంచాయతీలు, మాగనూరు మండలంలోని 16 పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలువగా.. నేటి కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడిన లిస్టులో టాప్‌లో ఉందన్నారు. పల్లెల్లో విస్తృతంగా పర్యటించి స్థానికంగా ప్రజల మౌలిక వసతులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. అలాగే ప్ర భుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రతి పంచాయతీలో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలన్నా రు. సమావేశంలో మాగనూరు సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కృష్ణ బీఆర్ఎస్ యువ నాయకుడు శివరాజ్ పాటిల్, మాజీ సర్పంచులు అశోక్‌గౌడ్, మల్రెడ్డి, నరసింహ, మక్తల్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమం తు, నాయకులు సమరసింహారెడ్డి, సుదర్శన్‌గౌడ్, బాలరాజు, బసంత్‌రెడ్డి, అశోక్ గౌడ్, రవి, పురుశోత్తం గౌడ్, ఈశ్వర్ యా దవ్, నేతాజీ రెడ్డి, జమీల్లతోపాటు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

