పాలమూరుకు మొండిచేయి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి చేయిచ్చారు.
- ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
- 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
- మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
- హాజరైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజనర్సింహ, జూపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు
- పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు..
- రివ్యూ సమయంలో కరెంట్ పోకుండా అధికారుల తంటాలు
మహబూబ్‌నగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి చేయిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులపై మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో మంత్రులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారులు, ఎం పీ, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా, సంక్షేమం, పర్యాటక శాఖలు, అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిపై నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యి కేవలం కాల్వలు మాత్రమే తవ్వితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పడేశారు. ఈ ప్రాజెక్టు మినహా మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడం విస్మయానికి గురిచేస్తోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పథకాలను పరిశీలించి ఫీల్డ్ విజిట్ రిపోర్ట్ పంపించాలని, నెట్టెంపాడు ప్రాజెక్టు డిజైన్‌ను మార్చే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. 2025 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. కానీ ఇప్పటికే ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయ్యాయి. కేవలం ఒక్క పాలమూరు లిఫ్ట్ చివరి దశ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా వి ఆపడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమీక్షలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ కార్యదర్శి వినోద్, గద్వాల తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారులతోపాటు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన నేపథ్యంలో పలువురు నా యకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అలాగే సమీక్ష జరిగినంత సేపు కరెంట్ పోకుండా అధికారులు తంటాలు పడ్డారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు..
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ఆయనన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామపంచాయతీ వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని ఉద్యోగులను పరోక్షంగా హెచ్చరించారు. కలెక్టర్ వారానికోసారి దవాఖానలు, పాఠశాలలను తనిఖీ చేయాలని, డీఈవోలు, ఎంఈవోలు ప్రతి రోజూ పాఠశాలలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఉ మ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణలో పెండింగ్ చెల్లింపులను వెంటనే చేయాలని, పెండింగ్ బిల్లులను రెండో ప్రాధాన్యత కింద చెల్లించాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టును మరోసారి రీ ఎగ్జామిన్ చేసి సాంకేతిక సమస్యలను గుర్తించాలన్నారు. ప్రాజెక్ట్ పూర్తికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని నిధులు కావాలో స్పష్టంగా అధికారులు నివేదిక అందజేయాలని సూచించారు. ఆర్డీఎస్కు సంబంధించి కర్ణాటక, ఏపీతో చర్చించాల్సిన విషయాలు, పరిష్కరించాల్సిన అంశాలను రూపొందించాలన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి, ఆర్డీఎస్‌పై కొత్త ప్రతిపాదనకు ఏమేం కావాలో ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులకు చెప్పారు. భీమా లిఫ్ట్ ఇరిగేషన్‌పై సమీక్షిస్తూ.. కానాయపల్లి ఆర్అండ్ఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు.
గ్రామసభ నిర్వహిం చి రీసర్వే, ప్రాజెక్టు నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలన్నారు. ఆర్అండ్ఆర్ సమస్య లేకుండా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు పరిశీలించాలని, హజిలాపూ ర్, చౌదర్పల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లకు నీటి లభ్యతను అంచనా రూపొందించాలన్నారు. 2025 డిసెంబర్ నాటికి కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజినీర్లు చెప్పారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్అండ్ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని సమస్యలను అధిగమించేందుకు అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల, మండలాల్లో జూనియర్, నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి మహబూబ్‌నగర్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. కార్యక్రమాల్లో ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, నారాయణరెడ్డి, శంకర్, మేఘారెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, విజేయుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

