పార్లమెంట్ ఎన్నికల్లో.. స్మార్ట్ యాప్స్
17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చ ర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచేందుకు వివిధ రకాల మొబైల్ యాప్ లను ప్రవేశపెట్టింది.
- పారదర్శకతే లక్ష్యంగా అమల్లోకి..
- యాప్‌ల ద్వారా వేగంగా ఫిర్యాదుల పరిషారం
- సద్వినియోగం చేసుకోవాలంటున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
మక్తల్ టౌన్, ఏప్రిల్ 21: 17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచేందుకు వివిధ రకాల మొబైల్ యాప్ లను ప్రవేశపెట్టింది. సువిధ, కేవైసీ, సి – విజిల్, అబ్జర్వర్, సాక్ష్యం, ఓటర్ హెల్ప్ వంటి యాప్‌లతో పాటు నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్‌ను సైతం కేంద్ర ఎ న్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, పార్లమెంట్ ఎ న్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనపై ఫి ర్యాదు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమై న సాయం, ఎన్నికల ఖర్చులు, పోలింగ్ కేంద్రాల వి వరాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సమాచారం తెలుసుకునేందుకు ఈ యాప్‌లను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఇవి ప్రతి ఆండ్రాయిడ్ మొ బైల్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా చర్య లు తీసుకున్నది.
ఓటర్ హెల్ప్..
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కొత్త ఓటర్ల న మోదు, ఓటర్ల జాబితా వివరాలు, ఎలక్ట్రోరల్ రో ల్లో ఓటర్ పేరు సెర్చ్ చేయడం, ఓటు వేసేందుకు అర్హత ఉందో లేదో నిర్ధారించేందుకు ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. డిజిటల్ ఫొటో ఫొటోస్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా, ఎన్నికలకు సంబంధించిన వార్తల అప్డేట్ పొందవచ్చు.
కేవైసీ..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. క్రిమినల్ కేసులు, వాటి స్థితి, నేరాల స్వభావం వం టి వివరాలు ఉంటాయి. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు వారికి ఓటు వేయకుండా ఉం డేందుకు ఈ యాప్ ఓటర్లకు సహాయపడుతుంది.
నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్..
నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ) ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను పరిషరించేందుకు ఎన్నికల కమిషనర్ కు సహాయపడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటరు తన మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లో ప్రొఫైల్ నమోదు చేసుకోవచ్చు. అలాగే దీని ద్వారా ఎన్నికల సంఘానికి పలు సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవచ్చు. నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికల అధికారి స్పందించి సమస్య పరిషారం చూపే విధంగా రూపొందించారు. పో లింగ్ బూత్ ఉన్నచోట ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు ఎన్నికల ఖర్చు అక్రమాల వంటి వాటికి సం బంధించిన ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా చేయవ చ్చు. సకాలంలో పరిషారం కూడా పొందవచ్చు. పౌరులు తమ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఈ యాప్‌లో పరిశీలించుకొని అవకాశం ఎ న్నికల సంఘం కల్పించింది.
దివ్యాంగులకు ‘సాక్ష్యం’
దివ్యాంగులకు తోడ్పడేలా సాక్ష్యం యాప్‌లో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉంచారు. దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు వాయిస్ సహాయం అందిస్తుంది. టెక్స్ట్ స్పీచ్ సదుపాయం సైతం ఈ యాప్‌లో ఉన్నది.
అబ్జర్వర్..
ఎన్నికల కోడ్ దుర్వినియోగం, అక్రమాలకు సంబంధించిన కేసులను తెలుసుకునేందుకు వీలుగా అబ్జర్వర్లకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకునేందుకు ఎన్నికల పరిశీలకులు ముందుగా లాగిన్ క్రియేట్ చేసుకుని వారి పాస్వర్డ్ తో సమాచారం అందించాలి.అక్రమాలను అరికట్టేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది తమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉన్న ప్రదేశం వంటి సమాచారం పొందవచ్చు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ‘సీ-విజిల్’
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితే ఎన్నికల ఉల్లంఘనలపై సాక్షాలతో సహా ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఆడియో, వీడి యో, ఫొటో ఏదో ఒక రూ పంలో రికార్డ్ చేసి యాప్ లో ఫిర్యాదు చే స్తే అధికారులు నిమిషాల్లో స్పందిస్తారు. 100 నిమిషాల్లో అధికారులు తప్పనిసరిగా స్పందించి, ఘ టనపై తగిన చర్యలు చేపట్టేలా యాప్ రూ పొందించారు. పార్టీలకతీతంగా ఎవరు కో డ్ ఉల్లంఘించినా ఫిర్యా దు చేసేలా, ఎన్నికల సమయంలో డబ్బుల పంపకాలు, ఉ చితాలు, బహుమతులు అందజేయడం, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను వాహనాల్లో తరలించడం వంటి ఉల్లంఘనలను, వీడి యో, ఫొటో, ఆడియో క్లిప్‌లను ఈ యాప్‌లలో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. అలాగే సులభంగా వినియోగించేలా త యారు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

