సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసలు
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరికలు
భూత్పూర్ మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన 50మందికి పైగా కాంగ్రెస్ నాయకులు ముడా డైరెక్టర్ సత్తూర్ చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మయ్య ఆధ్వర్యంలో అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మదనాపురం/భూత్పూర్, అక్టోబర్ 17 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే భూత్పూర్ మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 50 మంది ముడా డైరెక్టర్ సత్తూర్ చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మయ్య ఆధ్వర్యంలో అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నామన్నారు.
గ్రామాలాభివృద్ధిని కాంక్షించే ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారన్నారు. పార్టీకి నమ్మకంతో పనిచేస్తే.. మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో మదనాపురం గ్రామానికి చెందిన వడ్డె రవికుమార్, కొత్తపల్లికి చెందిన మంజునాథ్, వెంకటన్న, శ్యామల్, కురుమూర్తి, మొగులన్న, ఆంజనేయులు, మన్నెంతోపాటు మరో 50 మంది.., వార్డు సభ్యుడు సత్యనారాయణ, జంగయ్య, వెంకటేశ్, చెన్నయ్య, నాగరాజు, గణేశ్, బాలాజి, గోపి, పవన్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, నాగులు, శంకర్, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, మనోహర్, చిన్నా తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

