అమ్రాబాద్, ఫిబ్రవరి 4 : అమ్రాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రబుద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు సదరు బాలికను బాలసదన్ కేంద్రానికి తరలించారు.
ఈ విషయంపై అమ్రాబాద్ ఎస్సై వీరబాబును వివరణ కోరగా లైంగికదాడి ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.