MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
MBBS Seat | తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటూ, చదువుపై పట్టుదలతో ముందుకు సాగిన ఓ పేదింటి ఆడబిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
మాగనూర్ : పేదరికం ఆమె లక్ష్యానికి అడ్డుకాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటూ, చదువుపై పట్టుదలతో ముందుకు సాగిన ఓ పేదింటి ఆడబిడ్డ ఎంబీబీఎస్ సీటు ( MBBS seat ) సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. మాగనూర్ గ్రామానికి చెందిన బులిమెని ఆంజనేయులు కుమార్తె బులిమెని మాధురి ( Madhuri ) వైద్య విద్యకు ఎంపికై తన కుటుంబంతో పాటు గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
తండ్రి ఆంజనేయులు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ పనులతో పాటు చిన్నచిన్న విద్యుత్ మరమ్మతు పనులు కూడా చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. మాధురి తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబ ఆర్థిక భారాన్ని పంచుకుంటోంది.
తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను దగ్గరగా చూసిన మాధురి, వారి ఆశలను నెరవేర్చాలనే సంకల్పంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
మాధురి తన విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోని ప్రతిభ పాఠశాలలో ఏడో తరగతి వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మక్తల్‌లోని బ్రిలియంట్ పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్ విద్యను మహబూబ్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో పూర్తి చేసింది. డాక్టర్ కావాలనే తన చిన్ననాటి లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేసి వనపర్తిలోని వైద్య కళాశాలలో ఉచిత వైద్య విద్య సీటు సాధించింది. తల్లిదండ్రుల కష్టాన్ని తన విజయంగా మార్చుకుంటూ ముందుకు సాగిన ఆమె ప్రయాణం గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలను జైలు నుంచి తీసుకెళ్లి ఇంటి శుభ్రం.. జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

