గృహజ్యోతితో 63వేల మందికే లబ్ధి
గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
- మిగతా వారి పరిస్థితేంటి?
- 70 మినీలిఫ్ట్లలో మోటర్లు పనిచేయడంలేదు
- తక్షణమే వాటిని వినియోగంలోకి తేవాలి
- ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, జూన్ 22 : గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు అధికారులు తమకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి విద్య, వైద్యం, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి, ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్కారు బడుల్లోని ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతి టీచర్ హాజరుపై డీఈవో, ఎంఈవోల పర్యవేక్షణ ఉండాలన్నారు.
విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాం సకాలంలో అం దించాలన్నారు. అదేవిధంగా 2017-18లో సబ్స్టేష న్లు మంజూరై, పనులు పూర్తయ్యి నేటికీ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. జిల్లాలో కొ త్తగా 13 సబ్స్టేషన్లు మంజూరు కాగా వాటిలో ఆరిం టి పనులు నడుస్తున్నాయని, మరో నాలుగు టెండర్ దశలో.. రెండు స్థల స్వాధీన దశలో.. మరొకటి న్యాయస్థానం పరిధిలో ఉన్నదని అధికారులు వివరించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో సమస్యల కారణంగా ఆలస్యమవుతుందని అధికారులు వివరణ ఇచ్చారు. సాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా, కాల్వలో జ మ్మును వెంటనే తొలగించాలని, జిల్లావ్యాప్తంగా ఉన్న 70 మినీలిఫ్ట్లలో మోటర్లు పనిచేయడం లేదని తమ దృష్టికొచ్చిందన్నారు. వెంటనే చర్యలు తీసుకొని వినియోగంలోకి తేవాలని ఆదేశించారు.
అత్యవసర సేవల నిమిత్తం దవాఖానకు వచ్చే రోగులను మరో దవాఖానకు రెఫర్ చేసే సంస్కృతికి వైద్యాధికారులు స్వస్తి పలకాలన్నారు. రోగుల విషయంలో సిబ్బంది ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రంలో శిశు మరణాలపై ఆరా తీశారు. ప్ర భుత్వ జనరల్ దవఖానలోని విలువైన చికిత్స పరికరాలను సక్రమంగా వినియోగించుకోవాలని, నిరుపయోగంగా ఉన్న వాటిని వినియోగంలోకి తీసుకు రావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులతో శాఖల వారీగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వా ర్, ఎం.నగేశ్, మున్సిపల్ చైర్మన్ మహేశ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

