నా నేల
నా వనరులు
నా ఇల్లు
నా బతుకు .. నా నేలపై
వాడు వచ్చాడు
ప్రపంచమంతా తిరిగి తిరిగి
ఎక్కడా ఇసుమంత చోటు దొరక్క నా చెంతకు,
పోనీలే అని ఇంత జాగా వాడికిచ్చా
మతాలు వేరైనా మనిషని ,
తిన్నింటి వాసాలు లెక్కెట్టాడు
నా నేలను ముక్కలు ముక్కలు జేస్తూ
ముందుకు సాగుతున్నాడు.
దురాక్రమణలో వాడు
మనిషి కాదు ఉన్మాదని గ్రహించే లోపే
దాడులతో వాడు,
నేనేమో పిడికిలి బిగిస్తున్నా!
పుట్టిన నేలను దక్కించుకోవాలని!
నేను తునాతునకలైనా చివరంటా!
ఎరుపు నా తోవ!!
-గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201