నెత్తురలికిన నేలల్లో
ఏటూరు నాగారం పల్లెల్లో కరకు బూట్ల ముద్రల్లోంచి స్వప్నాలు మొలకెత్తడం నువ్వు చూశావా? నెత్తురలికిన నేలల్లో చదువులమ్మలు పుట్టుకురావడం నువ్వు ఊహించావా? మూడుతరాలు అడవిబాట పట్టినచోట త్యాగాలు అక్షరాలై వికసించడం ఎంతటి ఓదార్పు! బతుకవోయిన ఊళ్లల్ల పుట్లకొద్ది ధాన్యం రాసులు దేనికి సాక్ష్యం!
ఏటూరు నాగారం పల్లెల్లో
కరకు బూట్ల ముద్రల్లోంచి
స్వప్నాలు మొలకెత్తడం
నువ్వు చూశావా?
నెత్తురలికిన నేలల్లో
చదువులమ్మలు పుట్టుకురావడం
నువ్వు ఊహించావా?
మూడుతరాలు
అడవిబాట పట్టినచోట
త్యాగాలు అక్షరాలై
వికసించడం ఎంతటి ఓదార్పు!
బతుకవోయిన ఊళ్లల్ల
పుట్లకొద్ది ధాన్యం రాసులు దేనికి సాక్ష్యం!
ఇప్పుడు
పాలమూరు ముసలి తల్లులు
బిడ్డల్ని కండ్లముందే చూస్కుంటున్నరు
వలసలు నిన్నటి పీడకల
వికారాబాద్ తండాల పసిపాపలు
అమ్మఒడిలోనే ఆడుకుంటున్నరు
కన్నపేగును అమ్ముకునే గోస లేదు
ఏడేడు పిడీలను.. కరువు కాటేసిన కాడ
గాసమందక పశువులు
కబేలాలకు పోయిన కాడ
ఎవుసం పండుగై వెలుగుతుంది!
తలాపునే గొంతు తడపని గంగమ్మ
ఈ నేల నేలంతా నాట్యమాడుతుంది!
ఇయ్యాల పచ్చని చేలే తెలంగాణ సంతకం
ఇప్పుడు
కళ తప్పిన పల్లెలకు.. కాళేశ్వరం కేసీఆర్
అవిసిపోయిన గుండెలకు ఆసరా కేసీఆర్
‘హమార్ తాండేమా హమార్ రాజ్’
సర్పంచులైన లంబాడా బిడ్డల దర్పం!
‘జల్ జంగల్ జమీన్’
పోడు భూముల్లో స్వాభిమాన సేద్యం!
పల్లెలకూ పాకుతున్న విద్వేష భూతం
గంగా జమున వెలుగులో ఆవిరవుతుంది!
మగ్గం ఇప్పుడు ఉరి పగ్గం కానే కాదు
బంగారు చీరల్లో బతుకమ్మ తల్లులు
నేతన్న కండ్లల్లో నిండైన వెలుగులు
నిన్నటి తెలంగాణంటే
మొండిగోడల మీద బుల్లెట్ గురుతు
కర్ఫ్యూ చాటున వెతుక్కుంటున్న రోజు కూలి
బొంబాయి బస్సెక్కే నిస్సహాయ చూపు
ఇయ్యాళ్ల నా తెలంగాణ..
అన్నం బెట్టే అక్షయ పాత్ర!
చీకట్లను చిల్చే గండదీపం!!
దేశానికే దారిచూపిన వేగుచుక్క!!!
– రంగు నవీన్ ఆచారి 80991 66666
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

