సందువోకుండ ముగ్గులేసి
సంకురాతిరి పండగంటే మా తెలంగాణల సకినాల పండగే& కంచుడువెట్టని కడపే ఉండది...
సంకురాతిరి పండగంటే మా తెలంగాణల సకినాల పండగే&
కంచుడువెట్టని కడపే ఉండది…
ఊళ్లె రోజుకో ఇల్లని వంతు వెట్టుకొని సీకట్లనే బియ్యం నానవెడితే…
తెల్లారంగ గిర్ని కాడ నిలవడి నిలవడి పిండి పట్టిచ్చుకచ్చేటోల్లు…
అమ్మమ్మ మా వాడకున్న నలుగుర్ని సకినాలు సుట్ట రమ్మని…
ఉతికిన రెండు పాత శెద్దర్లు పర్శి నడివిట్ల గౌరమ్మను వెడితే…
అందరు ఒక్కతీరు సకినాలు సుడుదురు…
తాతకి సకినాలు దంగయని మెత్తగ బెల్లపరిసెలు చేసి సాటుకు తనబ్బిల ఓరగవెట్టేది&
పండుగకు రెండొద్దుల ముందుగాల్నే ఆకిట్ల ముగ్గేయ బియ్యప్పిండి పట్టిచ్చి…
బోగినాడు మబ్బుల మూడింటికే లేశి కొట్టంల పెండ తెచ్చి గుంజపొంట పెట్టేది..
ఆకిలంత ఊడ్చల్లి సందువోకుండా గిర్క వట్టి ముగ్గేసుకత్తే…
అవ్వగారింటికచ్చిన ఆడిబిడ్డ పీటేసి గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పుదిచ్చేది..
పెరట్ల గర్కపోసలు, బంతి పూలు కోస్కచ్చి…
సోలల వడ్లు, రేగువండ్లు, మక్కిత్తులు, జొన్నలు, చిక్కులు, కలిపి…
ముగ్గుముగ్గుల గౌరమ్మలు పెట్టీ
నవధాన్యాలు పోసుకద్దురు..
సెవ్వుల్ల నూనెబొట్టేసుకొని తలకువోస్కొని…
అర్రలికి ఏళ్ల ముగ్గేసి ఇంటి దేవుడికి దీపం పెట్టీ..
పొయ్యికాడ ఎచ్చగా కూకొని
పులుగన్నం, పచ్చిపులుసు అండుతాంటే…
సన్నాయి సప్పుల్లతో గంగిరెద్దు బసవన్నలచ్చి పందిరికింద ఆటలాడితే…
మనువలు, మనవరాండ్లు ఎగురుకుంట తాత సుట్టు సంబురంగ తిరుగుదురు…
పట్నం నుండచ్చిన పాలోల్లందరు ఒకరింటికి ఒకలువోయి కట్టసుఖాలు మాట్లాడుకునుడే..
మా సంకురాతిరి పండుగ…
పండుగంటే కొత్త బట్టలేసుకునుడే కాదు..
కండ్లనీళ్లు తీసుడు…
బిడ్డ బస్సెక్కేదాకా కడుపులవెట్టుకొని సూసుకొనుడు…
సకినాల సంచిచ్చి సాగనంపుడు…
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

