విప్లవధార అగ్నిధార జేజేలు
అందరు మెట్లెక్కి సుఖపడాలనుకుంటారు పూలపరిమళ విలాసాలనే అనుభవిస్తుంటారు
అందరు మెట్లెక్కి సుఖపడాలనుకుంటారు
పూలపరిమళ విలాసాలనే అనుభవిస్తుంటారు కానీ
పీడితుల కలంగా అవకాశాలను విసిరేసి
ప్రజాకంటక పీడకులని ఎదిరించిన సాహసి
నవాబుల నిలువెత్తు రాచరికాల దాస్యాలు
రజ్వీ రాబందులు దేశ్ముఖ్ దొరల అకృత్యాలు
దిక్కులదిరేలా పర్జన్యమై గర్జించాడు
నా తెలంగాణ కోటి రత్నాల వీణై విప్లవించాడు
తెలంగాణ కోసం శవమైనా సరేనని
ఓరే పిశాచమా! నీ రాచరికం సమాధేనని సవాలిసిరాడు సిమెంట్ కలిపిన బువ్వతో
బందీఖానాలో హింసలు
హత్యల పన్నాగాలెన్నైనా
కవన పయోనిదికి మరణం లేదు
చీకటి కారాగారంలో
కదులనియ్యని ఉక్కు సంకెళ్లు
బొగ్గే సుద్దముక్కై జైలుగోడల
నిండా నల్లనల్లని అక్షరాలు
జై తెలంగాణ అంటూ
భాస్వరమై మండిన ధిక్కారాస్ర్తాలు
నిజాం నిరంకుశ గుండెల్లో పెనుమంటలు
తెలుగుకు తావే లేదన్న కత్తుల బోనులో
తెలంగాణ రచయితల సంఘం తొలి కెరటమై
ఊరు వాడలు ఉత్తేజ కవిత్వమై
తెలుగు వెలుగును దేశానికి ఎలుగెత్తి
బహుభాషా సాంస్కృతిక సేవలై ప్రవహించాడు
శతకాలు రుబాయీలు పద్యాలు నాటికలు
వ్యాసాలు పీఠికలు గేయాలు
నేలంతా మేలుకొలుపు
గజల్ ప్రక్రియలో తొలి పాదమై
అనుసృజనలో వెల్లివిరిసిన తేట తెలుగుదనం
-వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

