పూల సింగిడి

బతుకమ్మ అంటే..
నిండార నిండిన అడవి పూల అందం!
బతుకమ్మ అంటే..
మెండార మెరసిన అడవి పూల సింగిడి!
వనకన్నెల ఒయ్యారి బతుకమ్మ
శిగపట్లలో శివుడి బిల్ల తొడిగింది
మబ్బు చాటు మెరిసిన
సింగిడి కిందికి వంగి
మొగసాళ్ళలో నిలిచిన బతుకమ్మ
ముక్కుకు ముక్కెరై నిలిచింది
చెరువుళ్లు నిండి అలుగుళ్లు
ఎళ్లిన అలల పొంగులు
బతుకమ్మ కురులకు
జడకుచ్చులు అమరినయ్
పచ్చని పైర గాలికి హొయలు
పోయిన బతుకమ్మ సింగారం
తెలంగాణ ప్రజలకు కొంగు బంగారమైంది!
బతుకమ్మ ఒక్కోసారి…
వెచ్చదనాల వెలుగుల రౌద్రరాణి అవుతుంది
కంటి కొనల నిండా సన్నని మెరుపులతో
పంచ భూతాలనే శాసించింది బతుకమ్మ
అష్టదిక్కులనే ఒడి నింపుకుంది బతుకమ్మ!
గంగ ఒడిలో చేరిన బతుకమ్మ
ఆ చెరువు తల్లికి తీరొక్క పూలతో తీరిచ్చింది
పచ్చ పచ్చగా మెరిసిన తంగేడు పువ్వుతో
పసిడి పసుపుల పరువమిచ్చింది
తెల్ల తెల్లగా మెరిసిన గునుగాయి పువ్వుతో
తేరు దివిటీల తేజమిచ్చింది
ఎర్ర ఎర్రగా మెరిసిన కట్లాయి పువ్వుతో
ఎర్ర కుంకుమ రేక తొడిగింది
రుస రుసలాడిన బీరంకె పువ్వుతో
రాగి కంటె తొడిగి రాగమిచ్చింది
గుస గుసలాడిన గుమ్మడి పువ్వుతో
ముగ్ధ భావాల మోదమిచ్చింది
గల గలా..
అలుగుళ్లు పొంగుతుంటే బతుకమ్మ చప్పట్లతో
చెరువు తల్లి జతకట్టి ఆడింది
జల జలా..
అలుగుళ్లు పారుతుంటే బతుకమ్మ పాటలతో
చెరువు తల్లి జత కట్టి పాడింది..!
–డాక్టర్ వి. త్రివేణి
9951444803
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

