వెలుగు పాట
ఏడాది అయినా మనసు ముక్కలు ముక్కలుగానే ఉన్నది
ఏడాది అయినా
మనసు ముక్కలు ముక్కలుగానే ఉన్నది
గోడలన్ని నల్లటి మస్కలు నీ పాట మాటినక
వెలుగు పాటను పోగొట్టుకున్నట్టున్నది
వాకిట్లో పూలచెట్టు తలవాల్చే ఉన్నది!
అమాంతం
జీవనది ఒక్కసారిగా ఆగిపోయినట్టుంది
నీ సవ్వడి లేక కాలం దిగులేసుకున్నది
ఆకాశం నుంచి చినుకుల్లా
జన మైదానంలో ఆ రాగాలు
గోరింటాకు పూసినట్టే
గల గల గర్జనకు
నేల మీద జనమే కాదు
చెరువులో చేపలు కోలాటమేసేవి
జ్వరం పట్టినవాడు కూడా
జెజ్జనకరే జెన్ దూలా ఆడేది
సెలయేరులా రాగం ఎంత మధురం
పాటల పేగు మెడకేసుకొని పుట్టినట్టు
కణ కణ కంచు కంఠం గాంభీర్యంగా
నెమలి పింఛం విప్పినట్టు గొప్ప ఊపిరి
రాళ్లకు రెక్కలను మొలిపించే పాటలు
గుండెలను వేడెక్కించే గీతాలు
గడ్డిపోసలు నిటారుగా నిలబడే పౌరుషాలు
ఒక్కొక్క పాట ఒక్కో లడాయే!
ఆధిపత్యాలనే కాదు
కరుణ లేని శివుడునీ కడిగేసిన ధీరత్వం
ఆలోచనలను మండించే సామాజిక స్ఫూర్తి
అనేక సమభావనల మూర్తిమత్వం
వెన్నెల పొడుపులా
తెలంగాణ సాకారానికి
నిప్పుల నెగళ్ల పాటలు!
కరెంట్ లేకున్నా సర్దుకుంటాం
విత్తనం మొలువకపోయినా బిగపట్టుకుంటాం
నీ ధ్వని వినకపోతే ఉండలేకపోతున్నం
పాలమూరు పాట తీపిని చూసి
కళ్లు మండినట్టున్నవి
ఎదుగుతున్నప్పుడే తుంచటం ఎంత విషాదం
మిత్రమా..
సముద్రమంతా దుఃఖమైనా విప్లవిస్తాం
మీ ఆశయ సిద్ధికి కవిత్వమై ప్రవహిస్తాం..
వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

