నీ గుండె వెన్నముద్దతో తయారయిందా?
వెన్నెల ముద్దతో తయారయిందా?
ఎదుటివాని కష్టాలను చూసి
నిలువెల్లా నీరయిపోతావు
నీ కలం నిండా కన్నీళ్లను నింపుకున్నావా?
శ్రమజీవి చెమట చుక్కలు పోసుకున్నావా?
కవిత్వమంతా ఉప్పుదేలిన మనిషి వాసన కొడుతుంది
నువ్వసలు పోలీసువా?
తీవ్రమైన తీవ్రవాదివా?
అన్యాయాన్ని టార్గెట్ చేసి
మాటల తూటాలు దించుతావు
లక్ష్యాన్ని ఛేదించే బాణంలా
భూమిని ముద్దాడే వానచినుకులా
నీ కవిత్వం మా మెదళ్లను కడిగి పారేస్తుంది
ఇప్పుడు అన్యాయం డొక్కలో
కలం పోట్లు పొడిచే భయం లేని
గొంతులు కావాలి
ఫాసిజం మీదికి ఫిరంగులు విసిరే
నీలాంటి మనుషులు కావాలి
బతికున్న పీనుగుల్ని
తిట్టటానికైనా ఒకసారి వచ్చిపో కాళోజీ!
-తోకల రాజేశం
9676761415