శ్లో: ఆత్మనో ముఖ దోషేణ
బధ్యంతే శుక శారికాః
బకాస్తత్ర న బధ్యంతే
మౌనం సర్వార్థ సాధనం
తా: చిలుకలు, మైనాలు తమ యొక్క మంచో, చెడో మాటల వల్ల పంజరములో బంధింపబడుచున్నవి. కొంగలు మౌనముగా ఉండడం వలన స్వేచ్ఛగా ఉండబడుచున్నవి. ఒక్కొక్కసారి మౌనం వల్ల కూడు సమకూరును.
ఆవె: అమ్మ భాష నుండు నత్యంతమధురము
భాషలన్ని టందు బాదుషాహి
అమ్మనేర్పు భాష కమ్మదనమువేరు
నారగించనదియు ననువుగుండు
ఆవె: భాషలన్నిటందు బాదుషాగా వెల్గు
విత్తు నుండి వచ్చు విటపిలాగ
పొరుగు మొక్క కాదు పోకడ యెరుగదు
అమ్మపెట్టు మొక్క ననువుగుండు
ఆవె: కోట్ల భాషలున్న కోరుకొనును జిహ్వ
తల్లిభాష మాట యెల్లవేళ
మరవబోని భాష మదిలోన స్థిరమయ్యి
పలుకు రూపమయ్యి బయటకొచ్చు
ఆవె: దేహి యెక్కడున్న దేశ విదేశాన
మాతృభాష మాట మరువలేడు
జిహ్వనత్తుకొన్న జిగురులా నుండది
తల్లి మాట పలుకు తప్పదంటు
ఉ: భాషగు తల్లినేర్పునది
భద్రమగున్ పలు భాషలందదిన్
దేశ విదేశమైన తను తెల్పును
మాటలు తల్లిభాషలో
వేషము జాడతెల్పునది
వెల్గుతునుండగ వాడవాడలన్
– డి.వినాయక రావు
90594
94259