మట్టి ప్రేమికుడు
ఆయనొక నిత్య శ్రామికుడు . ఆయనొక మట్టి ప్రేమికుడు.. అమ్మ గర్భంలోంచి పురుడు పోసుకున్నా నడక నేర్చి నాగలి పట్టి నడిచింది మాత్రం పొలం గట్ల పైనే..
ఆయనొక నిత్య శ్రామికుడు .
ఆయనొక మట్టి ప్రేమికుడు..
అమ్మ గర్భంలోంచి పురుడు పోసుకున్నా
నడక నేర్చి నాగలి పట్టి నడిచింది మాత్రం
పొలం గట్ల పైనే..
మట్టిలోనే పెరిగి మట్టిలోనే తడిసి
మట్టి మనిషిగా ఎదిగి పిడికెడు ముద్దకి
జాడ అయ్యాడు..
ఎందరో ఆకలిని తీర్చే ఆప్తుడయ్యాడు..!!
కాలం అలారం మోగిస్తే
కోడి కూత నిద్దుర లేపితే
భానుడొచ్చి కితకితలు పెడితే
బతుకు బాటకి పయనమవుతాడు ..!!
పడమటి దారి చూపుతుంటే
ఇంటి వైపుకి దారి మళ్లుతాడు..!!
చెమట చుక్కలు వాన జల్లులు
రెండు మేని పైనుంచి జారుతుంటే
పోరాటానికి సిద్ధం అయిన సైనికుడిలానే
దారి వెంట నడక సాగిస్తాడు..!!
పంచ భూతాలతో సావాసం చేస్తూ
వాన చినుకు కోసం
ఆ కళ్ళల్లో ఎన్ని ఎదురుచూపులో…!!
శిశిరం దాటి వసంతానికి వేచి ఉన్నట్టు
పంట కోత కొచ్చే వేళ వరకు
చిన్న పిల్లాడిలా అల్లాడి పోతూనే ఉంటాడు..!!
గెలిచే వరకు సుఖ దుఃఖాలతో
పోరాడటం అలవాటే మరి..!!
అతనికి గుడి అదే బతుకు బడి అదే ..
రోజంతా ఆ మడి చుట్టూ ఎన్ని వేల
ప్రదక్షిణలో లెక్కకు రానివి…
చెట్టు చేమ పుట్ట గుట్ట అన్ని తెలుసు
గాలి పాటలు పాడుకుంటూ
వానల్లో తడిసి గట్టు పైన ఆడే
పొలం ఆటలు తెలుసు …!!
చిగురు తెలుసు వగరు తెలుసు
బతుకు చేదు అయితే మాత్రం
రోజు ఏ చెట్టు కింద సేద తీరుతాడో..
ఆ చెట్టు కొమ్మకే దేహాన్ని అర్పిస్తాడు…!!
మట్టి మనిషికి మట్టే ప్రాణం కదా
అందుకే మట్టిలోనే నిత్యం జీవించాలనుకుంటాడు..!!
– స్వప్న మేకల
9052221870
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

