శబ్ద రత్నాకరం !!
మాట్లాడే తీరుతోనే గజారోహణం గండపెండేరం నాల్క పై నోటికే ఎన్నెన్ని గ్రంథాలో కనబడకుంటే ఏమిటి! పిలిస్తే పలుకుతాయి సముద్రుడు రత్నగర్భుడైతే నాల్క శబ్దరత్నాకరం
తల్లి కడుపు నుంచి విశ్వవిద్యాలయంలోకి వచ్చిన
శిశువు నాల్కభాష మొదట శ్రీకారంగా
స్వీకారంగా ఏడ్పే!
ఎవరూ నేర్పని భాష
నేర్వకనే వచ్చిన ప్రపంచ భాష!
ఏడ్పు ఎక్కడైనా ఒకటే !
ఏ వ్యాకరణం లేదు !
మాటలు రాని వయస్సు నుంచి
మాటలు నేర్చి మర్లపడేంత వరకూ
నాల్కకు ఎప్పుడూ జాలువారే అభ్యాసమే
అందరూ అంటారు గాని తలలో నాల్క ఎక్కడిది !
నోట్లోనే నాల్క నానుతుంది
ఎప్పటికప్పుడూ నాల్క పై ఆశువుగా
ఎన్ని పదాలు ఊరుతాయో !
నిఘంటువు సైతం వెతుక్కుని బరువయ్యేంత !
తెలిసేలా ముద్రింపబడి లేవు గానీ
నాల్క పై ఒక్కో బుడిపె ఒక మహా గ్రంథమే
అందుకే నవరస రుచుల కావ్య వర్ణనలు
నాల్కకు ఎందరెందరు గురువులో !
అమ్మ నుంచి గణించి
మరీ లెక్క పెట్టి గుణించేంతగా గురువులు
నీదేం గొప్ప !
ఇంటర్వ్యూలో నీ నాల్కే కదా సమయానికి
తడబడకుండా తండ్లాడి జవాబులిచ్చేది
అందుకే ప్రత్యేకంగా నాల్కను తీపి చేసి సన్మానిస్తాం!
నాల్క ఇంకేం అడగదు ! సంతోషం లాలాజలం
నాల్క మహాజ్ఞాని పొగడటం తెలుసు..శపించటం తెలుసు
మాట్లాడే తీరుతోనే గజారోహణం గండపెండేరం
నాల్క పై నోటికే ఎన్నెన్ని గ్రంథాలో
కనబడకుంటే ఏమిటి!
పిలిస్తే పలుకుతాయి
సముద్రుడు రత్నగర్భుడైతే
నాల్క శబ్దరత్నాకరం !
కందాళై , రాఘవాచార్య
87905 93638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

