కాలికి గాయమైందని
నడక మానేద్దామా
తలనొప్పి వేధిస్తుందని
తలదీసి మొలేద్దామా?
భుజం మోపి నిలిచాక
భారం మోయక తప్పదు
అంచనాల్లేని గ్యారెంటీలు
అమలు చేయమంటే కుదరదు!
గత పదేళ్లుగా
దాహం తాపం ఎరుగని
తెలంగాణ ప్రజానీకం
ఎగాదిగా చూస్తున్నది!
భోషాణం నిండుకుందంటే
తెలంగాణ భోజనం మానేయదు
గుప్త నిధుల మీదే ధ్యాసుంటే
గమ్యమెప్పటికీ అయోమయమే!
మంత్రాలకు
చింతకాయలు రాలనప్పుడు
కాళేశ్వరం కాలి వేలు తెగిందన్నా
భూనభోంతరాలు దద్ధరిల్లవు!
నిప్పుల మీద
నడిచిన చరిత్ర నీకుంటే
నిజానిజాలు నిగ్గు తేల్చి
జనం ముందు స్వేద పత్రమవ్వాలి!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261