జాతి నిరీక్షిస్తోంది
నిరీక్షిస్తోంది జాతి నేత ఆగమనానికి వేచి చూస్తోంది జనత వేగు చుక్క ఉదయానికి కమ్మిన మబ్బులు తొలగి కాంతి పుంజాల వెలుగు గగన సీమనాసాంతం ఆవిష్కృతం కావాలని..
నిరీక్షిస్తోంది జాతి నేత ఆగమనానికి
వేచి చూస్తోంది జనత వేగు చుక్క ఉదయానికి
కమ్మిన మబ్బులు తొలగి కాంతి పుంజాల వెలుగు
గగన సీమనాసాంతం ఆవిష్కృతం కావాలని..
మత మౌఢ్యం మరుగునపడి
కుల కుంచితం వెలకిలబడి
సమ సమాజం శిరసెత్తి
గర్విస్తూ నిలువబడే
శుభ తరుణం రావాలని..
కార్మికులు, కర్షకులు, వ్యాపారుల
గుండె నిండా సంతోషం
ఉరకలెత్తు నవ యువతకు
ఉపాధుల సౌలభ్యం
పండుగలా పల్లె సీమ
నిండుగ వర్ధిల్లాలని
గ్రామ రాజ్య సంస్థాపన
కనుల ముందు నిలవాలని…
ఆక్రందనలన్నీ ఆఖరై పోవాలని..
ఆవేదనలన్నీ ఆవిరై పోవాలని..
బాపూజీ కరమ్ చంద్… బాపూ కేసీఆర్
బాట వొకటె.. మాటలొకటె..
ఆశయాలు, ఆదర్శాలు అలుపెరుగని ఉద్యమాలు
అవిశ్రాంత పోరాటం.. అంతులేని ఆరాటం
సత్యాహింసల పైన సాటిలేని నమ్మకం
సర్వ మత సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యం
నాడు కొల్లాయి గట్టుకున్న కొద్ది పాటి దేహానికి
కొండంత మనో బలం
పిలుపిస్తే పలికింది ఆసేతు హిమాచలం
నేడు బక్క పలుచని కాయం చెక్కు చెదరని ధైర్యం
ఒక్క పిడికిలెత్తితే ముక్కోటి స్పందన..
సబ్బండ వర్గాలను నిబ్బరంగ కలిపిన
ఊరు, వాడ కదిలించిన ఉద్యమాల ఉప్పెన
తెలంగాణ సాధన విజయానికి కేతన..
స్వాతంత్య్ర సముపార్జన ఆ బాపూ ఘన విజయం
స్వరాష్ట్ర ఆవిర్భావం ఈ బాపూ దిగ్విజయం
బాపూజీ కన్న కలలు సాకారం చేయాలని
మన బాపూ సదాశయం
ఆ శుభ తరుణం రావాలని..
భరతావని నిరంతరం ప్రతీక్షిస్తోంది నిజం..!
-మంత్రి శ్రీదేవి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Mahathma Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

