ఆజగామ యథాలక్ష్మీః
నారికేళ ఫలాంబువత్
నిర్జగామ యథాలక్ష్మీః
గజభుక్త కపిత్థ వత్
(ప:సిరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరితా బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ)
తా: మనకు కనబడకుండగనే కొబ్బరికాయలోనికి నీరు వచ్చినట్లు… సంపదలు రావలసిన సమయంలో మనకు తెలియకుండానే వస్తాయి. అట్లే.. కరి (ఏనుగు) మింగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లు… సంపదలు పోయే సమయంలో మనకు తెలియకుండానే పోతాయి.
-టి.సుధాకరశర్మ