నా సదువు
తట్టు బొంతల మీద పారుకుంటా బలుపాల తోటి బస్కీలు తీసిన సదువు..
తట్టు బొంతల మీద పారుకుంటా
బలుపాల తోటి బస్కీలు తీసిన సదువు..
తాటి కమ్మల సందులకెల్లి
తరగతి గుడిసెలకు తరలివచ్చిన సదువు..
నల్లాలం బొగ్గుతోటి సోపతి గట్టి
‘గట్టి’గ బోర్డు మీద ఎక్కిన సదువు..
ప్రశ్నలు జవాబుల తోటి పరేషాను గాకుంట
పతొక్క పాఠాన్ని పద్ధతిగా ముట్టిన సదువు..
సార్లెదురైతే మర్యాదకు సైకిలు దిగి
బుద్ధిగా సలాం జేసిన సదువు
సక్కటి సేతిరాత తోటి సూసిరాత కాపీల
నిత్తె గుడ్ లేపిచ్చుకున్న సదువు..
తప్పులు ఎల్లని భాష కోసం
ఎప్పుడు ఇమ్ల సెప్పిచ్చుకున్న సదువు..
కొనెల్ల లెక్కలు సక్కగుండాలని
ఎక్కాలాటలు ఆడిన సదువు..
పాత వయిలను సగం ధరకు కొని
పురాత సదూకున్న సదువు..
కోతి పనులు చేసినప్పుడు
కోదండం ఎక్కిన సదువు..
ఎండాకాలపు తాతిలల్ల సుతం
ఉండలేక వయిలు తెరవెట్టిన సదువు..
షురూ కెల్లి కొనాదాంక
సర్కారు బడికోయిన సదువు..
మా పల్లె నుంచి పట్నం దాంక
పయానం కట్టిన సదువు..
అల్లాడి శ్రీనివాస్
83416 63982
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

