మా ఊరి పానాది
ఊరికి కోసు దూరంల ఉన్న మా గుడ్డం కాడికి పోవాలంటే
ఊరికి కోసు దూరంల ఉన్న
మా గుడ్డం కాడికి పోవాలంటే
ఆ పానాదిల కెళ్లే పోవాలె
వానకాలంల పానాది నిండ
జాలువారే జాలు నీళ్లు
బండల కాడ కిందికి దూకుతుంటే
నీళ్ల గలగలల సప్పుడు
మంద్ర స్థాయిలో పసందైన
సంగీతంలా వినిపిస్తుండె
పానాదికి ఇరువైపులా
గుబురుగా పెరిగిన చెట్లు
పైకెళ్లి జడలు ముడేసుకునుండె
పొద్దుగూకక ముందే చిమ్మచీకటి
ఇంటికి వస్తుంటే ఈడికి రాంగనే
దయ్యాలు యాదికి వచ్చేవి
దేవున్ని గట్టిగా తలుచుకుంట
పానాదిల పరుగు దీస్తుంటిమి
పానాది యెంబడి పరికి పండ్లు
తెంపుతుంటే పరికి ముండ్లు
నెత్తురు కండ్ల జూసేవి
చింత చిగురు, ఓనగాయ
దోర చింతకాయల రుచి,
ఎండకాలం ఈతగొలలు కోసి
తెంపిన ఈత పండ్ల రుచితో
పానాది పదిలమైన ఓ మధుర జ్ఞాపకం
పానాది పక్కన పారుతున్న ఒర్రె
అందరి దూప తీర్చేది
కాల్వల పారే నీరు
పశు పక్ష్యాదుల దూప దీరిస్తే
పక్కనే ఉశ్కెల చెల్మె దవ్వుకొని
మట్టినీరు కొట్టేసి పేరిన నీళ్లకు
మూతివెట్టి తాగి మేము
దూప దీర్చుకునేటోళ్లం
ఇప్పుడు పానాది తూడ్చుకుపోయింది
దాని జాగల రోడయింది
చెట్లు గొట్టేసి నున్నగ జేసినంక
దాని ఆనవాలే చెరిగిపోయింది
కానీ మా అద్భుత బాల్యంలో
అంతర్భాగం ఆ పానాది
మరచిపోని నా చిన్ననాటి యాది
గిరిమాజి దామోదర్
99663 36960
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

