పూల పండుగ
గుమ్మడి రుద్రాక్ష గునుగు మందారము బంతిచామంతి కుంబడియు వీర తంగేడు నవవిధ త వులపూలతోన్ ఊరేగె బతుకమ్మ తేరువోలె
గుమ్మడి రుద్రాక్ష గునుగు మందారము
బంతిచామంతి కుంబడియు వీర
తంగేడు నవవిధ తరువులపూలతోన్
ఊరేగె బతుకమ్మ తేరువోలె
వేపకాయల అట్ల వెన్నముద్దటుకుల
ముద్దపప్పెంగిలి సద్దుల రుచి
అలిగిన నానబియ్యంబునన్ బతుకమ్మ
నాయనమ్ముల తోడ వాసిగాంచె
అంబికను తలంచి యనురాగ దివ్వెలై
అతివలెల్ల మెరిసెనాడిపాడి
పూలకోక గట్టి పుడమి పరవశింప
బంగరు తెలగాణ సింగడయ్యె.
కుల మతమ్ములనెంచక గొడవ పడక
బ్రతికినన్నినాళ్ళు పరుల హితము తలచి
తరుగులేనట్టి ప్రేమను సిరిగపంచు
బంగరు బతుకమ్మా నీకు వందనములు
తెలుగు వారి ఘనత నలుదిశల మెరయ
పసిడి వన్నెల బ్రతుకును వరమునొంది
ఇల తెలంగాణ మందున ఇంపుగొలిపె
అలరుబోడిల బతుకమ్మ ఆట పాట
తరుణుల వేల్పుగ వెలసిన
కరుణామృత వర్షిణి శుభకర గౌరమ్మా
చరితాత్మనొందెడి హృదిని
వరముగ కురిపింపవమ్మ పర్వదినమునన్
రాకుమార
95501 84758
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

