పిడికిలి శిశువు
శిశువుకు కడుపులో ఉన్నప్పుడే తల్లి స్వరాన్ని గుర్తుంచుకునుడు నిరంతరంగా మొదటి విద్య!
శిశువుకు కడుపులో ఉన్నప్పుడే
తల్లి స్వరాన్ని గుర్తుంచుకునుడు
నిరంతరంగా మొదటి విద్య!
అమ్మ తన కోసం ప్రసవ వేదనతో
మెలికల అరుపులుగా తండ్లాడుతుంటే
పుట్టకముందే తల్లిని హింసిస్తున్నానని
కడుపులో కన్నీళ్ల పర్యంతం శిశువు!
ఉమ్మ నీరులో కలిసిపోయిన పసి కన్నీటిని
ఎలా గుర్తించగలం
బహుశా నొప్పుల తల్లికి శిశువు నునువెచ్చని
బాష్ప స్పర్శ కడుపంతగా తెలిసే ఉంటుంది
కొన్ని గంటలకు మాతృమూర్తి విశాలమైన
ఒడిలోకి వచ్చాకా
తల్లి ఆనందాన్ని చూస్తూ కడుపు నిండా
క్షీర ధారాపాతాల బలంతో కేరింతలుగా శిశువు!
పురిటి గదిలో శిశువుకు మొదటి పండుగ!
అమ్మను ఎప్పటికీ ఇలాగే సంతోషంగా
ఉంచుతానని శిశువు పిడికిలి
బిగించి ప్రతిజ్ఞ చేస్తున్నాడు!
ఇంకా నాభి తెగి ఒక్క పేరైనా పెట్టుకోలే
తల్లిపై ఎంత ఎరుక!
భవిష్యత్తులో శిశువు ఇలాగే
పిడికిలి బిగిస్తూ ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తాడో!
– కందాళై రాఘవాచార్య 87905 93638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

