నీ బ్లౌజు బంగారం కానూ..!
బంగారం పెట్టుకోవడం తెలిసిందే. బంగారు అంచు చీరలు కట్టుకోవడమూ విన్నదే. కానీ ఇప్పుడు కనకపు జాకెట్లు తొడుక్కుంటున్నారు సిరిగల వనితలు. మొన్న అంబానీ ఇంట పెండ్లి వేడుకల్లో పొడచూపిన ఈ వింతలు, కాంతలకు కాంచనంపై ఉండే మక్కువను మిక్కిలి చేసి చూపిస్తున్నాయి.
బంగారం పెట్టుకోవడం తెలిసిందే. బంగారు అంచు చీరలు కట్టుకోవడమూ విన్నదే. కానీ ఇప్పుడు కనకపు జాకెట్లు తొడుక్కుంటున్నారు సిరిగల వనితలు. మొన్న అంబానీ ఇంట పెండ్లి వేడుకల్లో పొడచూపిన ఈ వింతలు, కాంతలకు కాంచనంపై ఉండే మక్కువను మిక్కిలి చేసి చూపిస్తున్నాయి.
జుట్టుగల అమ్మ ఏ కొప్పయినా వేస్తుంది అన్నట్టు, డబ్బులున్న అమ్మాయి ఏ రవికైనా తొడుగుతుంది అనుకోవచ్చు. కానీ, అందులోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా ఈ జాకెట్లను డిజైనర్లు తీర్చిదిద్దడంతో అవి వార్తల్లో నిలిచాయి. తన తమ్ముడి పెండ్లిలో ఈశా అంబానీ వేసుకున్న రవికను ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించారు. రకరకాల డిజైన్లలోని చెవి దుద్దులు, లాకెట్లలాంటి వాటిని ఇందులో జోడించారు.
కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగిన ఈ రవిక సిరికి సొగసిరిని జతచేసింది. ఇక, మరో రోజు ఇదే ఈవెంట్లో ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరో బంగారు రవికలో మెరిసింది. కాసులు, లక్ష్మీ లాకెట్లు, మామిడిపిందెలు, చిలుకల డిజైన్లు ఇందులో తళుక్కుమన్నాయి. పసిడి టెంపుల్ జువెలరీ మోడళ్లతో దీన్ని అలంకరించారు.
ఇక, అంతకుముందు ఒక ఈవెంట్ కోసం అమెరికన్ ఫ్యాషన్ మోడల్ గిగి హదిద్ కూడా అచ్చంగా బంగారు రవికను ధరించింది. కామసూత్ర స్ఫూర్తితో రూపొందించిన ఈ రవికలో దక్షిణ భారతదేశానికి చెందిన టెంపుల్ జువెలరీ డిజైన్లను పొదిగారు. దీన్ని కూడా సందీప్ ఖోస్లానే ముస్తాబు చేశారు. మొత్తానికి బంగారు బ్లౌజు నేటి హాట్ ట్రెండ్ అయిందన్న మాట!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

