గంజితో.. అపరంజిలా
అన్నం వండుతున్నప్పుడు వార్చే గంజి.. అమృతంతో సమానమంటారు పెద్దలు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. సౌందర్య చికిత్సలోనూ గంజి ప్రాధాన్యం ఎక్కువే.
అన్నం వండుతున్నప్పుడు వార్చే గంజి.. అమృతంతో సమానమంటారు పెద్దలు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. సౌందర్య చికిత్సలోనూ గంజి ప్రాధాన్యం ఎక్కువే.
- గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అపారం. వీటివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు అనేకం. మెత్తని వస్త్రంతో కానీ, పత్తి ముద్దతో కానీ గంజినీళ్లను ఒళ్లంతా పూసుకుని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తే కొత్త నిగారింపు వస్తుంది.
- గంజిలోని అమైనో యాసిడ్స్ కేశాలకు మరమ్మతు చేస్తాయి. మొదళ్లను బలపరుస్తాయి. జుట్టు చిట్లి పోకుండా అడ్డుకుంటాయి.
- తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుంటున్న దశలో.. రీహైడ్రేషన్ చాలా అవసరం. గంజినీళ్లు సహజమైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అందిస్తాయి. డీహైడ్రేషన్, నిస్సత్తువ నుంచి ఆదుకుంటాయి.
- నెలసరి సమయంలో ఇబ్బందిపెట్టే పొత్తికడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. ఒంట్లో అసౌకర్యంగా అనిపించినప్పుడు.. ఓ గ్లాసు నిండా గోరువెచ్చని గంజినీళ్లు తాగితే సరిపోతుంది.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. గంజిలోని ప్రత్యేక పదార్థాలు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా తోడ్పడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- cooked
- rice
- warche porridge
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

