Naya Mall | రికార్డ్ స్థాయి రికార్డర్
వ్లాగర్స్ మీ వాయిస్ క్లారిటీగా రావడంలేదని భావిస్తున్నారా? ఆన్లైన్ టీచింగ్‌లో గొంతులో గరగర లేకున్నా కిచ్‌కిచ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా? అయితే మీ వాయిస్ రికార్డింగ్ డివైస్ పాతపడ్డట్టే అని ఫిక్సయిపోండి. వెంటనే డిజిటెక్ డీడబ్ల్యూఎమ్-107 రికార్డర్‌కు షిఫ్ట్ అయిపోండి.
వ్లాగర్స్ మీ వాయిస్ క్లారిటీగా రావడంలేదని భావిస్తున్నారా? ఆన్లైన్ టీచింగ్‌లో గొంతులో గరగర లేకున్నా కిచ్‌కిచ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా? అయితే మీ వాయిస్ రికార్డింగ్ డివైస్ పాతపడ్డట్టే అని ఫిక్సయిపోండి. వెంటనే డిజిటెక్ డీడబ్ల్యూఎమ్-107 రికార్డర్‌కు షిఫ్ట్ అయిపోండి. లైవ్ ఇంటర్వ్యూలు, ఆన్లైన్ మీటింగ్‌లు, వీడియో టీచింగ్ క్లాస్‌లను వ్లాగ్ల్లో ఫుల్ క్లారిటీతో వాయిస్ రికార్డు చేయొచ్చు. డిజిటెక్ రూపొందించిన ఈ వైర్లెస్ మైక్రోఫోన్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లతో కంపాటబుల్ చేయొచ్చు.
ఆటోమెటిక్‌గా పెయిర్ చేయొచ్చు. ఇందులో ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ కారణంగా పక్కవాద్యాల ఘోష లేకుండా మీ గళం పక్కాగా రికార్డు అవుతుంది. ఈ జోడు వాయిస్ రికార్డర్స్ను పర్సనల్ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, కెమెరా, ట్యాబ్లెట్‌తో సులభంగా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో అమర్చిన 170 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ గంటన్నరలో ఫుల్ చార్జ్ అవుతుంది. దాదాపు 9 గంటల పాటు ఏ ఆటంకం లేకుండా సేవలు అందిస్తుంది. యూట్యూబర్స్, పోడ్కాస్టర్స్, ఆన్లైన్ టీచర్స్‌కు ఇది ఎంతో ఉపయుక్తం. ధర రూ.5,199 మాత్రమే! digitek.net.in లో అందుబాటులో ఉంది.

గ్రాండ్ బ్యాగ్
అతివలు ఆభరణాల తర్వాత అత్యంత మోజు కనబరచేది హ్యాండ్ బ్యాగ్‌లపైనే! మార్కెట్లోకి కొత్త చేసంచి రాగానే.. అప్పటిదాకా హత్తుకుని పట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను నిమిషంలో పరుల పరం చేసేస్తారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న మగువలు సౌందర్య సాధనాల తర్వాత ఎక్కువగా సెర్చ్ చేసేది, చర్చించేది హ్యాండ్ బ్యాగ్‌ల గురించే! వారి మనసెరిగి రకరకాల డిజైన్లలో హ్యాండ్‌బ్యాగ్‌లను విడుదల చేస్తుంటాయి ఉత్పత్తి సంస్థలు. మన్నికైన హ్యాండ్‌బ్యాగ్స్ తయారుచేయడంలో పేరెన్నికగన్న సంస్థ మిరాజియో తాజాగా ఆఫీస్ సిరిన్ ట్రెండ్ టాప్ హ్యాండిల్ బ్యాగ్‌ను విడుదల చేసింది. ముదిత చేతుల్లో ముచ్చటగా ఒదిగిపోయే ఈ సంచిలో ఇన్నర్ స్పేస్ కాస్త ఎక్కువే! పర్సనల్ గ్యాడ్జెట్స్తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఎంచక్కా ఇమిడిపోతాయి. క్లాసిక్ లుక్‌లో దర్శనమిస్తున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర రూ.4,999. miraggiolife.com వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు.

పెట్స్ దోస్త్
యజమాని ఇంట్లో లేనప్పుడు కుక్కలు బెంగ పడిపోతాయి. ఆఫీసుకు వెళ్లిన యజమానికీ తన కుక్క గురించీ ఇదే బెంగ! ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఈ ఫీలింగ్ ఎక్కువే. ఇందుకు పరిష్కారమే ఆర్వో పెట్ డార్డియన్. ఓగ్మెన్ (ogmen) రొబోటిక్స్ తయారుచేసిన ఈ చిట్టి రోబో.. యజమాని ఇంట్లో లేనప్పుడు పెట్స్‌కు కేర్ టేకర్‌గా ఉంటుంది. కుక్కపిల్లను ఆడించడం, సమయానికి ఆహారం ఆఫర్ చేస్తుంది. యజమానికి వీడియో కాల్ చేసి మాట్లాడించడం, పెట్ చేస్తున్న చిలిపి పనులను క్లిక్ చేసి యజమాని ఫోన్‌కు పంపటం దీని పని. అంతేకాదు, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో వీడియోలతో సహా పెట్స్‌కు బోధిస్తుంది. మొత్తంగా పెట్స్‌కు ఫ్రెండ్ అన్నమాట. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆర్వో పెట్ గార్డియన్ తోడుంటే.. ఆ యజమానులకు పెట్స్ గురించిన చింత అక్కర్లేదు. దీని ధర రూ.67 వేలు. వివరాలకు వెబ్‌లింక్ orobuddy.com క్లిక్ చేయండి.

వంటింటి కింగ్
మిక్సీ పచ్చడి చేస్తుంది. పొడులు చేసి పెడుతుంది. జ్యూస్ సిద్ధం చేస్తుంది. అదే గ్రైండర్ పిండి రుబ్బుతుంది. మిక్సీలోనూ పిండి రుబ్బుకోవచ్చనుకోండి. వండర్ చెఫ్ వారి చెఫ్ మ్యాజిక్ అంతకుమించి. ఇది మిక్సీ కమ్ గ్రైండర్ కమ్ ఓవెన్ కమ్ మేకర్! ఈ అల్టిమేట్ కిచెన్ టూల్ 18 రకాల సేవలు అందిస్తుంది. ఉల్లిపాయలు కోసి పెడుతుంది. కుడుములు ఉడకబెడుతుంది. పెరుగు నుంచి వెన్న తీస్తుంది. సూప్ చేసిస్తుంది. మజ్జిగ పులుసును కుతకుతా ఉడికిస్తుంది.. ఇలా 18 రకాల పనులు ఒంటిచేత్తో చేసిపెడుతుంది. అంతేకాదు, ఇందులో వందరకాల వంటలు ఇన్‌బిల్ట్ చేసి ఉన్నాయి. మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అది కోరినట్టుగా దినుసులు, కూరగాయలు వేసి మూతపెట్టేస్తే సరి.. చెప్పిన టైమ్‌లో ఆ వంటకాన్ని నలభీముల కన్నా పసందుగా వండి పెడుతుంది. వంట ఎందాకా వచ్చిందో ఫోన్లో చూసుకోవచ్చు కూడా! భలేగా ఉంది కదూ చెఫ్ మ్యాజిక్! ప్రీ-బుకింగ్ ప్రైస్ రూ.49,999గా నిర్ణయించారు. రెగ్యులర్ కాస్ట్ రూ.59,999గా పేర్కొంటున్నారు. దీని పనితనం తెలుసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి wonderchef.com వెబ్సైట్ దర్శించండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

