పుచ్చ క్రేజ్!
వజ్రం, నీలం, కెంపు... ఇలా రకరకాల రాళ్లు విభిన్న రంగుల్లో ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి. అలా సహజంగా లభించే జాతి రత్నాలలో ఒకటి.. వాటర్మెలన్ టూమలీన్. దీన్నే వాటర్మెలన్ ఎగేట్ అనీ పిలుస్తారు.
వేసవికాలం కూల్ ఫేవరేట్.. పుచ్చకాయ. ఈ పండును పోలినట్టుండే రత్నమూ ఒకటుంది. దీన్ని ‘వాటర్మెలన్ టూమలీన్’ అని పిలుస్తారు. ఇదో సహజసిద్ధమైన రాయి. నిండు రంగుల్లో మెరిసే ఈ జాతి రత్నంతో అందమైన ఆభరణాలు తయారవుతున్నాయి.
వజ్రం, నీలం, కెంపు… ఇలా రకరకాల రాళ్లు విభిన్న రంగుల్లో ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి. అలా సహజంగా లభించే జాతి రత్నాలలో ఒకటి.. వాటర్మెలన్ టూమలీన్. దీన్నే వాటర్మెలన్ ఎగేట్ అనీ పిలుస్తారు. అగ్నిపర్వతాలు బద్దలు అయినప్పుడు ఏర్పడే మాగ్మా.. ఆ తర్వాత చల్లబడి గడ్డకట్టి పోతుంది. క్రమంగా రాయిగా మారుతుంది. అప్పుడు ఏర్పడే ఖాళీల్లో కాలక్రమంలో నీటితో పాటు వెనెడియం, ఐరన్, మాంగనీస్ తదితర ఖనిజాలు వచ్చిచేరడం ద్వారా టూమలీన్లు రూపుదిద్దుకుంటాయి. ఆ ఖనిజాలు ఎంత మొత్తంలో చేరాయన్నదాన్ని బట్టి టూమలీన్ రాళ్లకు రకరకాల రంగులు తోడవుతాయి.

వాటర్మెలన్ టూమలీన్ విషయంలో లోపలి భాగంలో.. లిథియం, క్రోమియం లేదా మాంగనీస్ వల్ల గులాబీ రంగు వస్తే, బయటి వైపు ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం టైటానియం, ఐరన్లాంటి వాటి వల్ల జత చేరుతుంది. తొలిసారి 1902లో అమెరికాలో ఈ రకం రాయిని కనుగొన్నారు. ప్రస్తుతం అమెరికాతో పాటు బ్రెజిల్, శ్రీలంక, మడగాస్కర్, ఆస్ట్రేలియా, నైజీరియాల్లోనూ ఇది దొరుకుతున్నది. ఎక్కడైనా రాసుకుపోయినా గీతలు పడక పోవడం ఈ రాయి ప్రత్యేకత.
వాటర్మెలన్ టూమలీన్ హృదయ చక్రాన్ని శుద్ధి చేసి, ప్రశాంతతనిస్తుందని నమ్ముతారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో.. నగల్లో ధరించేందుకు చాలా మంది ఇష్టపడతారు. గుండ్రం, త్రికోణాకృతులకు మధ్యగా ఉండే దీన్ని చెవిపోగులు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, గొలుసుల్లో అలంకారంగా పొదుగుతారు. నిండు రంగుల్లో విభిన్నంగా, ఆకర్షణీయంగానూ ఉంటాయివి. నోరూరించే ఈ రత్నం మీకూ నచ్చిందా!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

