Female Employees | ఆమెను ఆపేదెవరు?.. ఆ విషయంలో వివక్ష అపోహేనా!
ఈ రోజుల్లో అతివలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. అవకాశాలను దొరకబుచ్చుకుంటున్నారు. పని ప్రదేశంలో ఎదురయ్యే అసమానతలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
Female Employees | ఈ రోజుల్లో అతివలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. అవకాశాలను దొరకబుచ్చుకుంటున్నారు. పని ప్రదేశంలో ఎదురయ్యే అసమానతలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అయితే, ఎంతకష్టపడినా శ్రమకు తగ్గ వేతనం పొందడం, ప్రమోషన్ల విషయంలో ఇప్పటికీ వివక్ష ఎదురవుతున్నదని కొందరి అపోహ! కానీ, అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితులు లేవని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు ఇవి..
అపోహ: పని ప్రదేశాల్లో స్త్రీలకు విశ్వాసం తక్కువ
వాస్తవం: ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడీ పరిస్థితి లేదు. మహిళా ఉద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. టీమ్ లీడర్లుగానూ రాణిస్తున్నారు. సకాలంలో పని పూర్తి చేయడంలో పురుషుల కన్నా మహిళలు ఒక అడుగు ముందే ఉంటున్నారు. పట్టుదలతోపాటు తెలివితేటల్లోనూ సత్తా చాటుతున్నారు.
అపోహ: పురుషులతో సమానంగా వేతనం ఉండదు
వాస్తవం: తన శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉన్న మహిళలు.. వర్క్ప్లేస్లో అసమానతలను ఎండగట్టడంలో ముందుంటున్నారు. వేతనాల విషయంలో వివక్ష చూపిస్తే.. తమ గొంతును గట్టిగానే వినిపిస్తున్నారు. పనివేళల నుంచి వేతనాల వరకు రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. అవసరమైతే పోరాడి మరీ తమ హక్కులను సాధించుకుంటున్నారు.
అపోహ: ఉన్నత స్థానానికి చేరుకోలేరు
వాస్తవం: మహిళా ఉద్యోగుల పురోగతి మగవారి కంటే నెమ్మదిగా ఉంటుందని కొందరి నమ్మిక. కానీ, ఈ తరం అతివలకు సామర్థ్యానికి తగ్గ స్థానం లభిస్తున్నది. ఇప్పటికే ఎందరో మహిళలు ఈ విషయాన్ని రుజువు చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్లోనూ తమ ప్రతిభతో రికార్డు ప్యాకేజీలు అందుకున్న యువతులు కోకొల్లలు. ప్రతిభ ఉన్నవారిని ఆపడం అన్నివేళలా సాధ్యం కాదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

