‘ఈ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి?’… ప్రతి ఉదయం చాలామంది మహిళలు ఎదురొనే ప్రశ్న ఇది. అల్మారాలో దుస్తులు నిండుగా ఉన్నా, సరైన కాంబినేషన్ గుర్తుకు రాక కొత్త దుస్తులు కొనడం, ఒకే తరహా రంగులు మళ్లీ మళ్లీ తీసుకోవడం, ఏ వస్ర్తాన్ని ఎప్పుడు ధరించామో మర్చిపోవడం సాధారణమే. ఈ సమస్యలకు సాంకేతికత సరికొత్త పరిషారాన్ని చూపిస్తున్నది. అదే వర్చువల్ వార్డ్ రోబ్. కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో పనిచేసే ఈ డిజిటల్ అల్మారా నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్.
డిజిటల్ క్లోసెట్ లేదా వర్చువల్ వార్డ్ రోబ్ అనేది మన అల్మరాలో ఉన్న ప్రతి వస్ర్తాన్ని, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలను మొబైల్లో డిజిటల్ రూపంలో భద్రపరచుకునే విధానం. యాప్‌లో వాటి ఫొటోలను అప్లోడ్ చేస్తే, మన అల్మారా మొత్తం ఫోన్లో కనిపిస్తుంది. ఏ దుస్తులు ఉన్నాయి? ఏవి ఎకువగా వాడుతున్నారు? ఏవి నెలలుగా అరల్లోనే ఉండిపోయాయి?!… అనే వివరాలను ఒకసారి చూసి తెలుసుకోవచ్చు. దీంతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఇప్పటికే ఉన్నవాటికి సరిపోయేవే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేని కొనుగోళ్లు తగ్గించుకోవడంతో పాటు, మన దగ్గర ఉన్న ప్రతిదాన్నీ పూర్తిగా వినియోగించుకోవచ్చు.
ఈ యాప్‌ల వెనుక పనిచేసేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ అనే సాంకేతికత. ముందుగా వినియోగదారులు తమ దుస్తుల ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత చిత్రాలను విశ్లేషించి, ఆ వస్త్రం రకం, రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్, స్లీవ్ స్టైల్ లాంటి విషయాలను ఏఐ స్వయంగా గుర్తిస్తుంది. ఉదాహరణకు… ఒక తెల్లటి లినెన్ షర్ట్‌ను ‘షర్ట్’, ‘వైట్’, ‘ఫుల్ స్లీవ్’, ‘క్యాజువల్’ అనే ట్యాగ్‌లతో వర్గీకరిస్తుంది. ఒక చీరను ‘ఎథ్నిక్’, ‘సిల్’, ‘పండుగలకు అనుకూలం’ అని గుర్తిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఏఐ మన అల్మారాలోని ఇతర దుస్తులతో సరిపోయే కాంబినేషన్లను రూపొందిస్తుంది.

ప్రపంచ ఫ్యాషన్ రంగం ఇప్పుడు, కొత్తది కొనడం కంటే ఉన్నదాన్ని తెలివిగా ఉపయోగించడం.. అనే ఆలోచన వైపు అడుగులు వేస్తున్నది. ఏఐ వార్డ్రోబ్ యాప్‌లు కూడా అదే లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఒకే వస్ర్తాన్ని విభిన్న రీతుల్లో ఉపయోగించే మార్గాలను చూపించడం ద్వారా కొత్త కొనుగోళ్ల అవసరాన్ని తగ్గిస్తాయివి. ఫలితంగా ఖర్చు తగ్గడమే కాకుండా వస్త్ర వ్యర్థాలు కూడా తగ్గుతాయి. తద్వారా పర్యావరణ పరిరక్షణలో కూడా ఇవి మంచి పాత్ర పోషిస్తున్నాయి.
బీరువా నిండా కొత్త దుస్తులు ఉండటమే కాదు ఫ్యాషన్ అంటే, ఉన్న దుస్తులను సృజనాత్మకంగా, తెలివిగా వినియోగించుకోవడం.. అనే కాలానికి నాంది ఈ వర్చువల్ వార్డ్రోబ్లు. ఆ పనిలో ఇప్పుడు ఏఐ ఒక డిజిటల్ సహాయకురాలిగా, వ్యక్తిగత స్టైలిస్ట్‌గా మారుతున్నది. అల్మారాను అరచేతిలోకి తీసుకొచ్చిన వర్చువల్ వార్డ్రోబ్… ప్రతి మహిళకు సమయం ఆదా చేసే, ఖర్చు తగ్గించే, స్టైల్‌ను మెరుగుపరిచే కొత్త సాంకేతిక సహచరి అనే చెప్పాలి. మరి, ఇకపై ‘ఏం వేసుకోవాలి?’ అనే సందేహానికి సమాధానం చెప్పేది మీ అల్మరా కాదు… మీ చేతిలోని ఏఐ యాప్!
రానున్న రోజుల్లో ఏఐ మరింత అభివృద్ధి చెందనుంది. మన మేని రంగుకు సరిపోయే వర్ణాలను సూచించడం, శరీరాకృతికి తగ్గ దుస్తులను సిఫారసు చేయడం, ఆన్లైన్లో కొనుగోలు చేసే దుస్తులు మీకు ఎలా కనిపిస్తాయో వర్చువల్‌గా చూపించడం వంటి ఫీచర్లు మరింత విస్తరించే అవకాశం ఉంది. కొన్ని సంస్థలు ఇప్పటికే వర్చువల్ ట్రై-ఆన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.

స్మార్ట్ వార్డ్‌రోబ్‌కు తోడుగా నిలిచే రకరకాల యాప్‌లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రజాదరణ పొందిన కొన్నింటి గురించి చూద్దాం…
ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ వార్డ్రోబ్ యాప్‌లలో ఇది ఒకటి. దుస్తుల ఫొటోలను అప్లోడ్ చేస్తే ఏఐ వాటి బ్యాక్ గ్రౌండ్‌ను తొలగించి, రంగు, రకం, డిజైన్ ఆధారంగా వర్గీకరిస్తుంది. రోజువారీ అవుట్ఫిట్లు సూచించడం, ఖర్చు వివరాలను ట్రాక్ చేయడం, స్టైల్ సలహాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు.
ఈ ఉచిత యాప్‌లో మన దగ్గర ఉన్న దుస్తులతోనే కొత్త కాంబినేషన్లు రూపొందించుకోవచ్చు. ప్రయాణాల కోసం ప్యాకింగ్ లిస్టులు, ఆ వారపు డ్రెస్సింగ్ ప్లాన్, వాతావరణానికి అనుగుణమైన దుస్తుల సూచనలు కూడా లభిస్తాయి.
డిజిటల్ వార్డ్రోబ్తో పాటు ప్రొఫెషనల్ స్టైలిస్ట్ సేవలు కూడా అందించే యాప్. ఏ వస్ర్తాన్ని ఎన్నిసార్లు ధరించారో, ఒకసారి ధరించడానికి అయ్యే ఖర్చులాంటి వివరాలను విశ్లేషించి చూపిస్తుంది.
ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారుల్లో ప్రసిద్ధి చెందిన యాప్. డిజిటల్ అల్మారా తయారు చేయడం, అవుట్ ఫిట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ప్రయాణాలకు ప్యాకింగ్ లిస్టులు సిద్ధం చేయడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.