గువ్వ కాళ్లకు.. గవ్వ జోళ్లు!
సాగర తీరాల వెంట పరిగెడుతుంటే గవ్వల గుసగుసలు పాదాన్ని మురిపించాయో.. చెలియ అడుగులకు అచ్చెరువొంది అక్కడే సేదతీరాలని గవ్వలే మనసుపడ్డాయో.. కారణం ఏమైనా, అతివ పాదరక్షలకు అలంకారమై కూర్చున్నాయీ సముద్ర సింగారాలు.
సాగర తీరాల వెంట పరిగెడుతుంటే గవ్వల గుసగుసలు పాదాన్ని మురిపించాయో.. చెలియ అడుగులకు అచ్చెరువొంది అక్కడే సేదతీరాలని గవ్వలే మనసుపడ్డాయో.. కారణం ఏమైనా, అతివ పాదరక్షలకు అలంకారమై కూర్చున్నాయీ సముద్ర సింగారాలు. ‘సీషెల్ సాండిల్స్’ అందం అమ్మాయిల్ని కట్టిపడేస్తున్నది. ఫ్లాట్స్ నుంచి హీల్స్ దాకా రకరకాల చెప్పుల మీద అమరిన గవ్వలు పాదాలకు కొత్తలుక్ తెస్తున్నాయి.

గవ్వలు అష్టాచెమ్మా ఆడేందుకే కాదు.. అమ్మాయి పాదాలను అందంగా అలంకరించేందుకూ ఉపయోగపడతాయి అంటున్నారు నయా డిజైనర్లు. తాము అనుకున్నది అక్షరాలా సత్యమని నిరూపించేందుకు సరికొత్త డిజైన్లలో వీటిని తీర్చిదిద్దుతున్నారు.ఆటలో ఎత్తులేయడం ఎంత ముఖ్యమో
ఎత్తుమడమల్ని ముచ్చటగా తీర్చిదిద్దడమూ అంతే ప్రధానమని భావిస్తున్నారు. ఆడినా ఓడినా ఆనందం మిగిలినట్టే… చెప్పు ఏదైనా అందంగా కనిపించడమే ప్రధానం అంటున్నారు. అందుకే ఇప్పుడు అన్ని రకాల చెప్పుల్లోనూ గవ్వలను ప్రయోగిస్తున్నారు.

స్ట్రాప్ శాండిల్స్, ైస్లెడ్స్, వెడ్జెస్, ఫ్లాట్స్.. ఇలా భిన్న రకాల పాదరక్షల మీద ఇవి కనువిందు చేస్తున్నాయి. కొల్హాపురి, రాజస్థానీ మోడల్ చెప్పుల్లోనూ జొప్పిస్తున్నారు. గవ్వలకు తోడు రంగుల ఊలు, ముత్యాలు, బీడ్స్, గజ్జెలను జోడించి పాదుకలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. దారాలతో పాటు చెమ్కీ ఎంబ్రాయిడరీ చేసిన చెప్పులకు లయబద్ధంగా వేలాడుతూ గవ్వలు మెరుస్తున్నాయి. ఫ్యాషన్ డ్రెస్లమీదికైనా, సంప్రదాయ దుస్తులమీదికైనా గవ్వల పాదరక్షలు వారెవ్వా అనిపిస్తున్నాయి.


Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

