పెంపుడు జంతువులు జాగ్రత్త
ఎండలు ముదురుతున్నాయి. మనుషులతోపాటు ఇతర జంతువులపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్కలు వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా గుర్తించడం లేదట.
ఎండలు ముదురుతున్నాయి. మనుషులతోపాటు ఇతర జంతువులపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్కలు వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా గుర్తించడం లేదట. దాంతో, మూగ జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలకు వడదెబ్బ సోకినప్పుడు కనిపించే లక్షణాలను వివరిస్తున్నారు.
వడదెబ్బ తగిలినప్పుడు కుక్కలలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. సాధారణం కంటే వేగంగా, ఆపకుండా గాలి పీల్చుకుంటాయి. అదే సమయంలో వాటి చిగుళ్లు ముదురు ఎరుపు, నీలం, ఊదా రంగులోకి మారుతాయి. నోటి నుంచి విపరీతంగా లాలాజలం కారుతుంది. ఎక్కువ వడదెబ్బకు గురైన కుక్కలు నడవలేకపోతాయి కూడా. ఒకేచోట పడిపోయి ఉంటాయి. కొన్నిసార్లు రక్తంతో కూడిన విరేచనాలు కూడా చేసుకుంటాయి. దాన్ని ముట్టుకుంటే చాలా వేడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. కుక్కకు వడదెబ్బ సోకిందని గుర్తించవచ్చు.
ప్రథమ చికిత్సతో మేలు..
కుక్కకు వడదెబ్బ తగిలిందని గమనించిన వెంటనే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కుక్కల్ని చల్లని ప్రదేశానికి మార్చాలి. ఏసీ /ఫ్యాన్ ఉన్న గదిలోకి తీసుకెళ్లాలి. గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని కుక్కపై పోయాలి. తల, మెడ, పొట్ట భాగం, కాళ్ల కింద తడి గుడ్డతో తుడవాలి. నీళ్లు మరీ చల్లగా (ఐస్ వాటర్) లేకుండా చూసుకోవాలి. లేకుంటే రక్తనాళాలు కుంచించుకుపోయి, వేడి బయటికి పోకుండా ఉంటుంది. కుక్క స్పృహలోకి వస్తే.. కొంచెం కొంచెంగా నీరు తాగించాలి.
కుక్కలకు పాదాల అడుగు భాగం నుంచే వేడి త్వరగా బయటికి పోతుంది. కాబట్టి వాటిని బాగా తుడవాలి. ప్రథమ చికిత్సతో కుక్క కాస్త కోలుకోగానే.. పశువైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే వడదెబ్బ వల్ల కిడ్నీలు, కాలేయం లాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కాబట్టి, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- heat
- Heatstroke
- pet dogs
- pets
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

