చటుక్కున చూస్తే పెయింటింగ్‌లా, ఇంకాస్త గమనిస్తే పుస్తకంలా కనిపించే క్లచ్ ఇది. ఒలింపియా లీ ట్యాన్ సంస్థ తయారు చేసిన ఈ చిత్రపైన పర్సును ‘కేఫ్ అండ్ క్రాయిసెంట్ క్లచ్’గా పిలుస్తున్నారు. కాన్వాస్ క్లచ్ మీద సునిశితమైన ఎంబ్రాయిడరీతో రూపొందించారు. వన్నెల కలబోతగా దారాలతో నేసిన ఈ చిత్రం చూడ్డానికి పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ఇక పర్సు ఆకృతి, పరిమాణం అచ్చం పుస్తకాన్ని పోలి ఉండటంతో.. చూడగానే పుస్తకమనే పొరబడతారు. ఈ వింత పర్సును net-a-porter.com ద్వారా కొనుక్కోవచ్చు. ధర సుమారు రూ.లక్షా ఇరవైనాలుగు వేలు.
పచ్చ పచ్చగా..
లేత పసుపు వన్నె కళ్లకు హాయి గొలుపుతుంది. ఇక, వేసవి తీవ్రత వేళ ఈ రంగు దేహానికి సాంత్వననిస్తుంది కూడా. ఇదే పసుపు వన్నెలో 100 శాతం ఆర్గానిక్ వాయిల్ కాటన్‌తో తయారైంది నికోబార్ నవాబ్ షర్ట్. ఆకులూ పువ్వుల ప్రింట్లతో వచ్చిన ఈ షర్టు చేతులను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని మోచేతుల దాకా మలిస్తే నీలం తెలుపు రంగుల పట్టీ వచ్చి ఫ్యాషనబుల్ లుక్‌ని ఇస్తుంది. అదే ఫుల్‌హ్యాండ్స్ ఉంచుకుని బటన్ పెట్టుకుంటే సాధారణ ఫార్మల్ చొక్కాలా కనిపిస్తుంది. అదే లేత వన్నెల ప్యాంటును జోడిస్తే ఫుల్ సమ్మర్ అవుట్ ఫిట్ అవుతుంది. ఈ చొక్కా ఖరీదు రూ. 4,500. nicobar.comలో దొరుకుతుంది.
చార్జర్ చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్ గ్యాడ్జెట్స్లానే చార్జింగ్ కూడా స్మార్ట్ అవుతున్నది. ఎలాంటి వైర్లూ అవసరం లేకుండా ఫోన్, ఇయర్‌ఫోన్, వాచీ చార్జ్ అయిపోతున్నాయి. అయితే ఒక్కో గ్యాడ్జెట్‌కు ఒక్కో చార్జర్ కాకుండా, అన్నిటికీ ఒకటే పనికొచ్చేలా మార్కెట్లోకి వచ్చింది ‘యాంబ్రేన్ ఎయిరోసింక్ క్వాడ్ ఫోర్ ఇన్ వన్ వైర్లెస్ చార్జర్’. ఫోన్, ఇయర్ ఫోన్లు పెట్టుకునేందుకు వీలుగా పోర్టు ఉంటుంది ఇందులో. దీనితో పాటు వచ్చే 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకుతో కూడా మన డివైజ్‌లకు వైర్‌లెస్‌గా చార్జింగ్ పెట్టుకోవచ్చు. టైప్ ఎ, టైప్ సి దీని నుంచి యూఎస్బీ కేబుల్ ద్వారా కూడా ఒకేసారి రెండు డివైజ్‌లకు చార్జింగ్ పెట్టుకునే అవకాశమూ ఉంది. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ పరికరం కనుక ఉంటే ఎన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉన్నా చార్జింగ్ చింత లేనట్టే. ఖరీదు 1,999 రూపాయలు మాత్రమే. ambraneindia.com ద్వారా అమ్ముతున్నారు.
ఎండకు గొడుగు
చలికాలంలోనే ఈ సారి పొగ రాజుకుంది. వేసవి ప్రారంభమే మంట అంటుకుంది. ఈ ఎండలకు బయటికి వెళ్లాలంటే చల్లని గొడుగు నీడ తోడు ఉండాల్సిందే. అందుకే తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నాయి. తాజాగా ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ మాషినో ఈ నారింజ వన్నె గొడుగును మార్కెట్లో పరిచయం చేసింది. గొడుగు నిండా బంగారు రంగు ప్రింట్లలో సంస్థ పేరును, పేరులోని అక్షరాలను డిజైన్లా ముద్రించింది. farfetch.comలో వీటిని అమ్ముతున్నారు. ధర రూ. 9,950.