Shilpa Shetty | చెక్కిన శిల్పం అన్నమాటకు ప్రాణమున్న నిదర్శనంలా శిల్పాశెట్టి దర్శనమిస్తుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ల మీద ఆమె చూపే శ్రద్ధ అందంలోనూ ప్రతిఫలిస్తుంది.
సినిమాల్లోనే కాదు, బయటా ఆమెది అదే దారి. పచ్చల రంగు టాప్ స్కర్టుకు జతగా, గోధుమ వన్నె ప్రింటెడ్ కేప్ ధరించి యూరోపియన్ లుక్లో… రోమన్ శిల్పంలా కనికట్టు చేస్తున్నది ఈ సుందరి.