వలపు వల వేయడంలో అమ్మాయి నవ్వుని మించిన ఆయుధం మరోటి ఉండదు. గుండెకు గాలం వేసేందుకు ఆమె కురులూ మన్మథుడి బాణపు విరులవుతాయి. వాటిని వయ్యారంగా సరిచేసుకుంటూ… నవ్వులు రువ్వుతున్న ఈ అమ్మడు ఆపరేషన్ వాలంటైన్ సినిమా కథానాయిక రుహానీ శర్మ.
తెలుగింటి పిల్లగా స్థిరపడ్డ ఈ హిమాలయ సౌందర్యం… కలంకారీ దుపట్టాతో జట్టు కట్టిన ఎరుపు రంగు చుడీదార్లో పక్కింటి అమ్మాయిలా పలకరిస్తున్నది.
– సి.ఎం. ప్రవీణ్