ఎన్ని సర్జరీలు చేసుకుంటావ్ అక్కా!
సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వారా ముఖారవిందాన్ని మరింత మురిపెంగా మార్చుకుంటారు.
సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వారా ముఖారవిందాన్ని మరింత మురిపెంగా మార్చుకుంటారు. ఈ సర్జరీలపై ఇండస్ట్రీలో, అభిమానుల్లో చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్లో అలాంటి చర్చే తెరమీదికి వచ్చింది.
సోషల్ మీడియాలోనూ ఈ చర్చ రచ్చగా మారింది. అరకొర అవకాశాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ రిచా చద్దా కామెంట్లు ఈ ఇష్యూకు తెరలేపాయి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ‘కొందరికి ఒంటినిండా విషమే! వయసు పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి.
అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పనిలేదు’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి కామెంట్ చేసిందా? అనే ఆలోచనలో పడ్డారు. అయితే రిచా మాట్లాడింది అదితీ రావు హైదరీ గురించే అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆమె కామెంట్లపై భిన్నమైన వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ‘రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్‌లా మారుతున్నది’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

