Chai | పొద్దున్నే చాయ్ వద్దు.. ఖాళీ కడుపుతో తాగడం హానికరమంటున్న పరిశోధకులు
చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు అరడజను సార్లు సిప్పు చేయకపోతే.. మనం తెలంగాణ బిడ్డలమే కాదు!
Chai | చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు అరడజను సార్లు సిప్పు చేయకపోతే.. మనం తెలంగాణ బిడ్డలమే కాదు! మిగిలిన సమయాల్లో ఫర్వాలేదు కానీ, పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం హానికరమే అంటున్నారు పరిశోధకులు. దీనిలోని కెఫీన్ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో రోజంతా మగతగా అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.చాయ్ మనల్ని మరిన్నిసార్లు వాష్‌రూమ్ వైపు నడిపిస్తుంది.
మూత్ర విసర్జన అధికం అవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ మొదలవుతుంది. కప్పులకొద్దీ చాయ్ తాగేవాళ్లు సహజంగానే మంచినీళ్లు ముట్టుకోరు. దీంతో ఒంట్లో నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఇక్కడితో అయిపోలేదు.. టీలోని టానిన్స్ అనే రసాయనాలు.. ఒంట్లోని ఐరన్‌ను, క్యాల్షియంను మింగేస్తాయి. అలా పోషక విలువల కొరతకూడా వేధిస్తుంది. తేనీరులోని రసాయనాలు పళ్లమీది ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దీంతో దంతాలరంగు మారిపోతుంది. అలా అని నిరాశపడాల్సిన పన్లేదు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిర్భయంగా టీ తాగొచ్చు. రోజుకు రెండుసార్లు నిర్మొహమాటంగా పుచ్చుకోవచ్చు. అంతకుమించి .. కప్పులు పెరిగేకొద్దీ తిప్పలే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

