స్టవ్ పక్కనే వద్దు!
వంటగదిలో చాలామంది మసాలా డబ్బాలను స్టవ్ పక్కనే ఉంచుతారు. ఇది వాటి రుచి, సువాసన త్వరగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. స్టవ్ నుంచి వచ్చే వేడి, ఆవిరి, తేమ కారణంగా మసాలాల్లోని సహజ సుగంధ తైలాలు (అరోమా) క్రమంగా తగ్గిపోతాయి.
వంటగదిలో చాలామంది మసాలా డబ్బాలను స్టవ్ పక్కనే ఉంచుతారు. ఇది వాటి రుచి, సువాసన త్వరగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. స్టవ్ నుంచి వచ్చే వేడి, ఆవిరి, తేమ కారణంగా మసాలాల్లోని సహజ సుగంధ తైలాలు (అరోమా) క్రమంగా తగ్గిపోతాయి. దీంతో వంటలో ఆశించిన రుచి, వాసన రావు. మసాలాలను ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే అల్మారాలో గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి.
పొడి మసాలాల కంటే పొడి చేయని మసాలా దినుసులు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే వాటిని పొడి చేస్తే రుచి మరింత మెరుగ్గా ఉంటుంది. మసాలా పౌడర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా, కొద్దికొద్దిగా తీసుకుంటే మేలు. వంట రుచిని పెంచాలంటే ఖరీదైన పదార్థాలు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న మసాలాలను సరైన విధంగా నిల్వ చేస్తే చాలు, ప్రతి వంటకంలోని సహజమైన రుచి, సువాసనను ఆస్వాదించవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- kitchen
- life style
- spices
- stove
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

